Prabhas : మొగల్తూరు రగడ : ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన.!

NQ Staff - September 30, 2022 / 10:39 PM IST

Prabhas : మొగల్తూరు రగడ : ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన.!

Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని మొగల్తూరులో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు లక్ష మంది అభిమానులు, మొగల్తూరు సహా, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

అయితే, ఈ కార్యక్రమం సాక్షఇగా వెలిసిన ఓ పోస్టర్ అందర్నీ విస్మయానికి గురి చేసింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేస్తూ, ప్రభాస్‌ని పొగుడుతూ దాన్ని రూపొందించారు. ఓ వ్యక్తి తన చేత్తో ప్లకార్డు తరహాలో దాన్ని ప్రదర్శించాడు. మరోపక్క, ఇంకొందరు వ్యక్తులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ని తూలనాడుతూ మీడియా ముందు మాట్లాడారు.

మంచి కార్యక్రమంపై విషం చిమ్మిందెవరు.?

కృష్ణంరాజు భోజన ప్రియుడు. ఆయన తన అభిమానుల్ని చాలా బాగా చూసుకునేవారు. అందుకే, ఆ అభిమానులకు బోల్డన్ని వంటకాలతో భోజనం పెట్టించింది కృష్ణంరాజు కుటుంబం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆ ఒక్క బ్యానర్, కొందరు వ్యక్తులు చెడగొట్టారన్న చర్చ ప్రభాస్ అభిమానుల్లోనూ జరుగుతోంది.

సోషల్ మీడియా వేదికగా, ప్రభాస్ అభిమానుల ముసుగులో కొందరు, చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ సహా రామ్ చరణ్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభాస్ అభిమాన సంఘాల నాయకులు సీరియస్ అవుతున్నారు.

రెండు కులాల మధ్య కుంపటిగా లేని వివాదాన్ని మార్చుతున్నారంటూ ప్రభాస్ అభిమానులే కాదు, మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు. చిరంజీవి, ప్రభాస్ అలాగే, చరణ్, ప్రభాస్.. కలిసి వున్న ఫొటోల్ని, వీడియోల్ని షేర్ చేస్తూ, హీరోల మధ్య రాజకీయ చిచ్చు పెట్టొద్దంటూ కామన్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రత్యేకించి ప్రభాస్ అభిమానులు.. ఎవరో కావాలని ఈ వివాదం రాజేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us