Prabhas : ప్రబాస్ బర్త్ డే సర్‌ప్రైజ్.! నో కాంప్రమైజ్ అంటోన్న ఫ్యాన్స్.!

NQ Staff - October 22, 2022 / 10:06 PM IST

Prabhas : ప్రబాస్ బర్త్ డే సర్‌ప్రైజ్.! నో కాంప్రమైజ్ అంటోన్న ఫ్యాన్స్.!

Prabas : అక్టోబర్ 23 ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ పుట్టినరోజును ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయ్. అయితే, ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎక్కడా ప్రబాస్ సందడి కనిపించడం లేదు.

అందుకు కారణం ఇటీవలే ప్రబాస్ తండ్రిగా భావించే ఆయన పెదనాన్న కృష్ణం రాజు మరణించడం. ఆయన మరణ వార్త నుంచి ప్రబాస్ ఇంకా కోలుకోలేదు. నిర్మాతలు నష్టపోకూడదన్న కమిట్మెంట్‌తో షూటింగ్‌కి హాజరవుతున్నాడే కానీ, సెలబ్రేషన్స్‌కి మాత్రం రాలేనని సన్నిహితులకు చెప్పేశాడట ప్రబాస్.

‘స్మాల్’ సరిపోదంతే..

ప్రబాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ అను ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మొన్నా మధ్య చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాల్ని ఆకాశానికెత్తేశాయ్.

హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నామంటూ అశ్వనీదత్ చెప్పారు.

దాంతో ప్రబాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ అప్‌డేట్ ఒకటి రిలీజ్ చేయాలంటూ నాగ్ అశ్విన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారట ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఎట్టకేలకు నాగ్ అశ్విన్ రెస్పాండ్ అయ్యాడు. స్మాల్ అప్‌డేట్ ఇస్తానని మాటిచ్చాడు.

రీసెంట్‌గా విడుదలైన ‘ఆది పురుష్’ టీజర్ ఫ్యాన్స్‌లో కొంత అసహనాన్ని నింపింది. ఈ టీజర్ పట్ల చాలా నెగిటివిటీ చోటు చేసుకుంది. ఆ ఇంపాక్ట్ పోవాలంటే, ‘ప్రాజెక్ట్ కె’ నుంచి, కానీ, ‘సలార్’ నుంచి కానీ, అదిరిపోయే అప్‌డేట్ రిలీజ్ చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్ స్వీట్ డిమాండ్ చేస్తున్నారట. మరి, ఫ్యాన్స్‌ని శాటిస్ ఫై చేసేలా ఎలాంటి సర్‌ప్రైజ్ రిలీజ్ చేయనున్నారో మేకర్లు కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us