Adipurush : ‘ఆదిపురుష్’ కోసం లెదర్ వాడలేదా.? టీమ్ దిగొచ్చినట్టుందే.!

NQ Staff - October 7, 2022 / 07:26 PM IST

Adipurush : ‘ఆదిపురుష్’ కోసం లెదర్ వాడలేదా.? టీమ్ దిగొచ్చినట్టుందే.!

Adipurush : ‘ఆంజనేయుడికి లెదర్ జాకెట్ లాంటిది వేయడమేంటి.. మీ మూర్ఖత్వం కాకపోతే.?’ అంటూ ‘ఆదిపురుష్’ టీజర్ మీద పెద్దయెత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. రావణుడి పాత్ర మీదా తీవ్రాతి తీవ్రమైన విమర్శలు వచ్చిపడ్డాయి.

మొత్తంగా ‘ఆదిపురుష్’ టీజర్ ఓ కార్టూన్ బొమ్మలా వుందన్న విమర్శల నేపథ్యంలో టీమ్ అప్రమత్తయ్యింది.. త్రీడీ టీజర్‌ని థియేటర్లలో ప్లే చేస్తోంది. ‘కార్టూన్ ఇంకొంచెం బెటర్‌గా కనిపిస్తోందంతే..’ అంటూ సెటైర్లు కొనసాగుతూనే వున్నాయి ‘ఆదిపురుష్’ మీద.

లెదర్ వాడకం జరిగిందా.? లేదా..?

‘మేం ఎలాంటి లెదర్ వినియోగించలేదు ఈ సినిమా కోసం.. ఏ పాత్రనీ కించపర్చే ఉద్దేశ్యం మాకు లేదు. నయా ట్రెండ్‌కి అనుగుణంగా రావణుడు, సీత, ఆంజనేయుడు, రాముడి పాత్రల్ని డిజైన్ చేశాం..’ అని చిత్ర దర్శకుడు ఓం రౌత్ తాజాగా వెల్లడించాడు.

కానీ, మోడ్రన్ ట్రెండ్‌కి తగ్గట్టు పాత్రలు మార్చేయడానికి ‘రామాయణం’ కల్పితగాధ కాదు.. భారతీయ సంస్కృతి.. అంటూ ‘ఆదిపురుష్’ టీమ్ మీద విమర్శల పర్వం కొనసాగుతూనే వుంది. ట్రోలింగ్ మరింత ఘాటుగా జరుగుతూనే వుంది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us