Adipurush : ‘ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్టింగ్‌ చేసిన ఝాన్సీ పారితోషికం..!

NQ Staff - June 7, 2023 / 11:13 PM IST

Adipurush : ‘ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్టింగ్‌ చేసిన ఝాన్సీ పారితోషికం..!

Adipurush : ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సుమ సమ్మర్ వెకేషన్ లో ఉన్న కారణంగా హోస్ట్ గా సీనియర్ యాంకర్ ఝాన్సీ వచ్చిన విషయం తెలిసిందే.

ఆమెతో పాటు ప్రదీప్ కూడా కో యాంకర్ గా వ్యవహరించాడు. మొత్తానికి ఆదిపురుష్‌ కార్యక్రమం లక్ష మందికి పైగా అభిమానులు హాజరవడంతో సూపర్ హిట్ అనిపించింది. అయితే యాంకర్ గా సుమ లేని లోటు స్పష్టంగా కనిపించింది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా సుమకు ఇచ్చే పారితోషకంలో ఝాన్సీకి సగం పారితోషికం ఇవ్వడం జరిగిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఝాన్సీ కి ఐదు లక్షల పారితోషికం తో పాటు లక్ష రూపాయల అదనపు ఖర్చులు ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.

ఈ స్థాయిలో పారితోషకం ఇచ్చిన కూడా ఆమె సంతృప్తికరంగా హోస్టింగ్ చేయలేదు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. సుమ యాంకరింగ్ కి అలవాటు పడిన అభిమానులు మరే యాంకర్ హోస్టింగ్ చేసిన కూడా ఇష్టపడడం లేదు.

అందుకే చాలా మంది స్టార్ హీరోలు సుమ ఉంటేనే కార్యక్రమం పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా సుమ ఉండాల్సి ఉంది. కానీ విడుదల తేదీ సమీపిస్తున్న కారణంగా సుమ డేట్స్ కోసం వెయిట్ చేయడం సబబు కాదని ఆమె లేని సమయంలో కామెంట్ చేశారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us