Adipurush : ఆదిపురుష్‌ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంపై క్లారిటీ వచ్చేసింది

NQ Staff - October 31, 2022 / 09:23 AM IST

Adipurush : ఆదిపురుష్‌ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంపై క్లారిటీ వచ్చేసింది

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ సంక్రాంతికి విడుదల కావడం లేదని తేలి పోయింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఖచ్చితంగా తమ హీరో సినిమా సంక్రాంతి కానుకగా వస్తుందని బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ లో సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

కానీ తాజాగా సినిమా ను సంక్రాంతి బరి నుండి తప్పిస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ కి చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని కారణాలవల్ల సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేక పోతున్నాం అంటూ వారు పేర్కొన్నారట.

ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియాకు తెలియజేయాల్సి ఉంది. సంక్రాంతికి చిరు మరియు బాలయ్య సినిమాలు ఉండటం వల్లే ఆదిపురుష్ ను వాయిదా వేసి ఉంటారు అనేది తెలియాల్సి ఉంది.

ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుందంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెప్తున్నారు. టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా చిన్న పిల్లల కార్టూన్ సినిమా మాదిరిగా ఉందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us