Poonam Kaur : పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్: జీసస్ ఎలా పుట్టారు.? ఎవరికి పుట్టారు.?

NQ Staff - August 27, 2022 / 05:02 PM IST

Poonam Kaur  : పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్: జీసస్ ఎలా పుట్టారు.? ఎవరికి పుట్టారు.?

Poonam Kaur  : వివాదాలతో పబ్లిసిటీ స్టంట్లు చేయడం ఎలా.? అన్నదానిపై బహుశా సెలబ్రిటీలు పీహెచ్‌డీలు చేసేశారేమో అనిపిస్తుంటుంది. సమయం సందర్భం లేకుండా సెలబ్రిటీలు వేసే ట్వీట్లు వారికి అప్పటికప్పుడు బోల్డంత ఫాలోయింగ్ తెచ్చిపెడుతుంటాయి.. అది చాలా సందర్భాల్లో నెగెటివ్ ఫాలోయింగ్ అవుతుంటుందనుకోండి.. అది వేరే సంగతి.

సినీ నటి పూనమ్ కౌర్ తాజాగా ఓ వివాదాస్పద ట్వీట్ వేసింది. సారీ చెబుతూనే, పెద్ద రచ్చ చేసింది ఆ ట్వీటు ద్వారా. ఎవరీ పూనమ్ కౌర్.? కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు తెలుగు సినిమాల్లో నటించింది.. పవన్ కళ్యాణ్ పేరుతో లింకులు పెట్టి తరచూ ఈమెని వివాదాల్లోకి లాగుతుంటారు.

జీసస్ విషయంలో ఆ డౌట్ ఎందుకు వచ్చింది.?

Poonam Kaur Recently Controversial Tweet

Poonam Kaur Recently Controversial Tweet

దేవుళ్ళ విషయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. జీసస్ ఎవరికి పుట్టారు.? ఎలా పుట్టారు.? అన్నది పూనమ్ కౌర్ ప్రశ్న. ఇదేం ప్రశ్న.? ‘నన్ను తప్పుగా అనుకోవద్దు.. నిజంగానే నాకు తెలియదు. నేను అంత చదువుకున్నదాన్ని కాదు.. కానీ, తెలుసుకోవాలనుకుంటున్నా..’ అంటూ పూనమ్ కౌర్ ఈ ప్రశ్న వేసింది.

సహజంగానే ఈ ప్రశ్నకు క్రిస్టియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. జీసస్ ఎవరికి పుట్టారు.? అంటే, అసలు అదేం ప్రశ్న. ఏ దేవుడి విషయంలో అయినా, ఇలా ప్రశ్నించగలమా.? కేవలం అటెన్షన్ కోసమే బహుశా పూనమ్ కౌర్ ఈ ప్రశ్న సంధించి వుండొచ్చు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us