Poonam Bajwa : ఎద అందాల‌తో ఎర వేస్తున్న పూన‌మ్ బ‌జ్వా.. గ్లామ‌ర్ షోకి అంతా ఫిదా

Poonam Bajwa : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం లేక చాలా మంది అందాల ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియాకే ప‌రిమితం అయ్యారు. సినిమా ఆఫ‌ర్స్ రాక గ్లామ‌ర్ షో తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్‌ బజ్వా.

Poonam Bajwa latest photo shoot
Poonam Bajwa latest photo shoot

టాలీవుడ్‌లో ‘మొద‌టి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ త‌ర్వాత బాస్ ‌, ప‌రుగు వంటి చిత్రాల‌తో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్‌ దొరికింది అనుకున్నారంతా.

Poonam Bajwa latest photo shoot
Poonam Bajwa latest photo shoot

కానీ తరువాత ఏం జరిగిందే ఏమో తెలుగు తెరపై నెమ్మదిగా కనుమరుగైంది ఈ బ్యూటీ. దీంతో త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ చిత్రాల్లో నటిస్తూ మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. అడ‌పా ద‌డ‌పా ఈ భాషల్లో నటిస్తూ త‌న ఉనికిని చాటుకుంటూనే ఉంది.వెండితెరపై ఒకలా చూసిన అభిమానులు ఇంటర్నెట్‌లో పూనమ్‌ బజ్వాని ఇలా చూసి షాక్‌ అవుతున్నారు.

ఈ అమ్మడి జోరుకు బేజార్‌ అవుతున్నారు. దీంతో రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. తమలోని రొమాంటిక్‌ యాంగిల్‌కి పని చెబుతూ కామెంట్లు పెడుతుండటం విశేషం. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ రెచ్చ‌గొడుతుంది.

పూన‌మ్ బ‌జ్వా గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయంటే అతిశ‌యోక్తి కాదేమో.మహారాష్ట్రకి చెందిన పూనమ్‌ బజ్వా ఇంటర్మీడియట్‌ టైమ్‌లోనే ర్యాంప్‌ షోలు మొదలు పెట్టింది. ర్యాంప్‌ షోలతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల సోయగం.. `మొదటి సినిమా` దర్శకుడి కళ్లల్లో పడింది. దీంతో ఈ బ్యూటీనికి ఫిదా అయిన దర్శకుడు `మొదటి సినిమా` కోసం హీరోయిన్‌గా ఆఫర్‌ చేయగా, కాస్త ఆలోచించి ఓకే చెప్పింది.