Sreeja : శ్రీజని చిరంజీవే చెడగొట్టాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి
NQ Staff - July 13, 2022 / 11:55 AM IST

Sreeja : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం తన భర్త పేరుని తన సోషల్ మీడియా అకౌంట్ నుండి తొలగించడంతో శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడిపోయారంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావడం లేదు. ఇక ఇప్పుడు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధం అయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్ పూజిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
హాట్ టాపిక్‌గా మారిన శ్రీజ పెళ్లి..
శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే ఒకడిని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్రీజ తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. కొన్ని రోజుల పాటు వారి కాపురం సజావుగానే సాగిన తర్వాత విడాకుల వరకు వెళ్లింది. విడాకుల తర్వాత శ్రీజ .. కల్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది.

Poojitha Comments on Sreeja 3rd wedding
వారి వైవాహిక జీవితానికి గుర్తుగా ఓ పాప జన్మించింది. అయితే కొన్నాళ్లుగా కళ్యాణ్ దేవ్ ను మెగా కుటుంబం పూర్తిగా పక్కన పెట్టేశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరాయి. శ్రీజ తన భర్తకు అధికారకంగా విడాకులు ఇచ్చిందని అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదనే వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా శ్రీజ తన స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా వీరి గురించి వస్తున్న వార్తలపై మెగా కుటుంబం ఏమాత్రం ఖండించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు శ్రీజ మూడవ వివాహం గురించి మాట్లాడారు. ఒక అమ్మాయి లేదా సెలబ్రిటీ తన వృత్తిపరమైన విషయాల వరకు అభిమానులతో పంచుకోవచ్చు కానీ వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెలియ చేయకూడదు.

Poojitha Comments on Sreeja 3rd wedding
ఇది పూర్తిగా తప్పు. శ్రీజ కూడా ఇదే తప్పు చేయడం వల్ల ఆమె గురించి ఇలాంటి లేనిపోని వార్తలు వస్తున్నాయి. ఆమె తన భర్త పేరును తొలగించినంత మాత్రాన విడాకులు తీసుకుందని ఎలా ఫిక్స్ అవుతారు. తన ఇష్టం ప్రకారం తన భర్త అనుమతితోనే తన భర్త పేరును తొలగించి తన ఇంటి పేరును పెట్టుకొని ఉండొచ్చని చిట్టిబాబు ఆ వార్తలను ఖండించారు.
ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు వారు సమాధానం చెప్పి ఖండించవచ్చు అనే ప్రశ్న ఎదురవగా, పని పాట లేని అడ్డమైన గాడిదలు ఏవేవో వార్తలు సృష్టిస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ సమాధానం చెప్పే అవసరం వారికి లేదంటూ ఈ సందర్భంగా నిర్మాత చిట్టి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక పూజిత మాట్లాడుతూ.. శ్రీజ మనస్తత్వం స్థిరంగా లేదని , ఆమె మూడో పెళ్లి చేసుకుంటే చిరంజీవి పరువు మొత్తం తీసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీజ బిహేవియర్ ఏమాత్రం పద్ధతిగా లేదని, ఆమెకు అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ లేదని చెప్పింది. అంతేకాదు ఇంట్లో ఆమెకు అతి గారాబం కాబట్టి ఇలా చేస్తుందేమో అనేసింది పూజిత.