Pooja Ramachandran : ఎంత స‌క్క‌గున్నావే.. మ‌తులు పోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ అందం

Pooja Ramachandran : సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించిన కూడా కొంద‌రికి గుర్తింపు రాక‌పోవ‌డంతో వారు బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయ్యారు. వారిలో పూజా రామ‌చంద్ర‌న్ ఒక‌రు. ఈమె బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళం అయినా కూడా తెలుగులో మాట్లాడుతూ ఇక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

Pooja Ramachandran saree photos
Pooja Ramachandran saree photos

తెలుగు చిత్రాల్లోనూ పూజా రామచంద్రన్ మెరిసింది. కానీ బిగ్ బాస్ షో ద్వారానే జనాలకు దగ్గరైంది. బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ ఆటను మలుపుతిప్పింది. రెండో సీజన్‌లో పూజా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిట్‌నెస్‌పై ఆమెకున్న శ్రద్ద, టాస్కులు ఆడటంలో ఆమెకున్న ఫైర్ అన్నీ కూడా జనాలకు బాగానే నచ్చాయి. కానీ బిగ్ బాస్ ఇంటి నుంచి త్వరగానే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

Pooja Ramachandran saree photos
Pooja Ramachandran saree photos

పూజాకి.. బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ అయితే వచ్చింది గానీ ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. ఆమె కెరీర్‌లో బిగ్ బాస్‌కు ముందు లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. అయితే బిగ్ బాస్ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలో పడలేదు.

Pooja Ramachandran saree photos
Pooja Ramachandran saree photos

పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో అందరూ షాక్ అవుతుంటారు. యోగాలు, వర్కవుట్లు భర్తతో కలిసి చేస్తూ పూజా రామచంద్రన్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంటుంది. భర్తతో రొమాంటిక్ పోజులు పెడుతూ నెటిజన్లను ఊరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తూ అంద‌రి మ‌తులు పోగొడుతుంది. పూజా పిక్స్ చూసి మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Pooja Ramachandran saree photos
Pooja Ramachandran saree photos

న‌టి పూజా రామచంద్రన్ ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో విజేగా పనిచేయడం ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలోనే ఆమె తన సహోద్యోగి విజయ్ ని వివాహం చేసుకున్నారు. అతనితో విడిపోయిన పూజా ..జాన్ కొక్కెన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. జాన్ కొకైన్ మొదట నటి మీరా వాసుదేవన్‌ను వివాహం చేసుకున్నాడు. తర్వాత అతను ఆవిడకు విడాకులు ఇచ్చి పూజతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.