Pooja Hegde : పెగ్గు క‌లిపి ఆ త‌ర్వాత చిందులేసిన పూజా హెగ్డే

Pooja Hegde : వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయినా పూజాహెగ్డే కొద్దిగా సమయం దొరకగానే ఇటీవ‌ల మాల్దీవులకు చెక్కేసిన విష‌యం తెలిసిందే. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కించే పోగ్రామ్ లు పెట్టుకుంది. బికినీల‌లో పూజా చేసిన ర‌చ్చ చూసి అంద‌రు షాక‌య్యారు.

TheNewsQube-
Pooja Hegde latest dance
Pooja Hegde latest dance

ఇక తాజాగా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో డిఫ‌రెంట్ స్టైల్‌లో ర‌చ్చ చేస్తుంది. ఒక‌వైపు సినిమాల‌తో బాగానే సంపాదిస్తున్న పూజా హెగ్డే మ‌ద్యానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. పెగ్గు క‌లిపి ఆ త‌ర్వాత త చిందులేసింది. మ‌ద్యం ప్రోత్స‌హించేలా ఇది ఉంది.

రెడ్ అంటూ జింజర్ చాలెంట్ అంటూ పెగ్గు కలిపింది. చిందులు వేసింది. తాను వేయడమే కాకుండా ఓ చాలెంజ్ విసిరింది. ఈ హుక్ స్టెప్పులతో ఓ వీడియోను చేయండని తన అభిమానులను కోరింది. రీ వైబ్ ది నైట్ అంటూ పూజా హెగ్డే రచ్చ చేస్తోంది. ఇది కేవలం 25 ఏళ్లు నిండిన వారికే అని చెప్పింది. బాధ్యతాయుతంగా తాగండనే హ్యాష్ టాగ్ కూడా పెట్టేసింది.

Pooja Hegde latest dance
Pooja Hegde latest dance

చాలెంజ్‌లో పాల్గొంటే విన్నర్స్‌కు మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొనే చాన్స్ ఉంటుందట. త్వరలోనే విజేతల పేర్లను ప్రకటిస్తారట. మొత్తానికి పూజా హెగ్డే బ్రాండ్ మాత్రం జానీ వాకర్ అని తేలింది. ఇక పూజా వేసిన హుక్ స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సెలెబ్రిటీలు సైతం మద్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రకటనల్లో నటిస్తుంటారు. అలాంటి ప్రకటనలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతుంటారు. ఇవ‌న్నీ తెలిసి కూడా పూజా హెగ్డే ఇలా ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.