Ponniyin Selvan Movie : మణి సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఇంత తక్కువ హైపా? పొన్నియిన్ సెల్వన్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టేనా?
NQ Staff - September 17, 2022 / 06:11 PM IST

Ponniyin Selvan Movie : ఇండియన్ సెల్యులాయిడ్ పై మణిరత్నం చేసిన మ్యాజిక్, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన తాలూకు ఎక్స్ పెరిమెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. బాక్సాఫీస్ రిజల్ట్, కమర్షియల్ లెక్కలతో సంబంధం లేకుండా ప్రతీ ఫ్రేమ్ తోనూ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయడం ఆయన స్పెషాలిటీ. అలాంటి మణిసార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్.కల్కి క్రిష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ PS-1 గా తెరకెక్కి ఈ నెల 30 న ఆడియెన్స్ ముందుకు రానుంది.

Ponniyin Selvan Movie Difficult Expect From Audience
సినిమాలో కథకు తగ్గ పాత్రల కోసం బడా స్టార్ కాస్టింగ్ నే ప్రిఫర్ చేశాడు మణిరత్నం. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్..ఇలా సౌత్ నటులతో పాటు బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అక్కడి యాక్ట్రెస్ లను కూడా తీసుకున్నాడు. మొత్తానికి సినిమా పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా దగ్గరపడింది. అంతా బానే ఉంది కానీ. అసలు సినిమాకి భారీ హైప్ మాత్రం చెప్పుకోదగ్గ బజ్ కానీ ఏమి లేదు. అదే హార్ష్ రియాలిటీ. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్ కి గొప్ప రెస్పాన్సయితే రాలేదనే చెప్పాలి. అలాంటి గ్రాండియర్, అండ్ వార్ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్టులు ఆల్రెడీ చూసేయడం ఓ రీజనయితే..
నేషన్ వైడ్ గా ఆడియెన్స్ కనెక్టయేందుకు ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడమే. చోళ రాజులు, వాళ్ల రాజ్యం, యుద్ధాలు అనేవి తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారేమో గానీ.. పూర్తి సౌత్ తో పాటు బాలీవుడ్ ఆడియెన్స్ ఎగ్జయిట్ అయ్యి ఈగర్ గా వెయిట్ చేస్తారనుకుంటే కష్టమే.
ఆ మాటకొస్తే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. అందులోనూ రోజా నుంచి రెహమాన్ తో కలిసి ట్రావెలవుతూ మంచి మెమోరబుల్ హిట్స్ తీశాడు మణిరత్నం. ఆ సినిమాలు సౌత్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా నేషన్ వైడ్ గా అప్లాజ్ దక్కించుకున్నాయి. కానీ పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్ పై హైప్ పెంచి క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మాత్రం రెహమాన్ మ్యాజిక్ పెద్దగా పనిచేయలేదు. తమిళ్ లో ఏమో గానీ.. తెలుగులో అయితే రెహమాన్, మణి రత్నం హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పాటల్ని ఆసక్తిగా విన్నది లేదు. ఇక కామన్ ఆడియెన్స్ కయితే ఎన్ని పాటలున్నాయో, అసలెప్పుడు రిలీజయ్యాయో కూడా తెలీదు.
పాటల్లో సాహిత్యం అయితే టాలీవుడ్ ఆడియెన్స్ కి ఇనుపగుగ్గిళ్లలా తయారయ్యాయంటూ ట్రోల్స్ కూడా పడ్డాయి పాపం. అలాంటప్పుడు బాలీవుడ్ లో పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. ఎంత మణిరత్నం మూవీ అయినా మహా అంటే ఓ డబ్బింగ్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేస్తారేమో గానీ.. ఏ ఇంటెన్షన్ తో అయితే ఆయన స్టార్ట్ చేశారో అంత రీచ్ దక్కడం చాలా అంటే చా..లా కష్టం. మరోవైపు సినిమాలో మోస్ట్ ఆఫ్ కాస్టింగ్ అంతా కోలీవుడ్ యాక్టర్సే అవడం వల్ల ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పెట్టిన బడ్జెట్ కి, మేకర్స్ పెట్టుకున్న అంచనాలకి తగ్గ హైప్ అన్ని భాషల ఇండస్ట్రీల్లో అయితే అస్సలు లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్.
ఇక బాలీవుడ్‌లో పొన్నియిన్ సెల్వన్ రిలీజవుతున్న సెప్టెంబర్ 30 నే విక్రమ్ వేద కూడా విడుదల కానుంది. కోలీవుడ్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి విక్రమ్ వేద మూవీని అదే పేరుతో వాళ్లే అక్కడా బాలీవుడ్ లోనూ రీమేక్ చేశారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ టైటిల్ రోల్స్ పోషించిన ఈ సినిమా ట్రైలర్ వల్ల సినిమాపై మంచి హైప్ క్రియేటయింది. పేరుకు రీమేక్ పిక్చరే అయినా హిందీ ఆడియెన్స్ అండ్ ఆ స్టార్స్ ఫ్యాన్స్ ఎంటర్టెయినయ్యే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. ప్రమోషన్స్ కూడా బాగానే ప్లాన్ చేస్తున్నారు. సో.. ఆ రకంగా 30వ తారీఖున బాలీవుడ్ ఆడియెన్స్ థియేటర్ కి వెళ్లాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే మూవీ విక్రమ్ వేదనే.

Ponniyin Selvan Movie Difficult Expect From Audience
అఫ్ కోర్స్.. సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలంటే ఈగర్ గా వెయిట్ చేసే కల్ట్ ఆడియెన్స్ లేకపోలేరు. హైప్, ప్రమోషన్స్ ని పట్టించుకోకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రిఫర్ చేసే ఆయన ఫ్యాన్స్ కూడా తక్కువేం కాదు. ఈ భాష, ఆ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఆయన మేకింగ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే జనాలు కూడా మరీ అంతలా అయితే తగ్గిపోలేదు.
కానీ ప్రెస్టేజియస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా, వందల కోట్ల బడ్జెట్ పెట్టి బడా స్టార్ కాస్టింగ్ తో సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు మూవీ థ్రిల్ నీ ఎక్స్ పెక్ట్ చేయడం ఎంత సహజమో. నేషన్ వైడ్ గా ఓపెనింగ్స్ తో పాటు భారీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని మేకర్స్ ఆశించడం కూడా అంతే సహజం. రిలీజ్ కి రెండు వారాల ముందుకూడా ఈ తరహా హైప్ తో, డల్ అనిపించే బజ్ తో మణితర్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్
విడుదలవుతుండడం మూవీ లవర్స్ ని కాస్త నిరాశపరిచే అంశమే. మరి కంటెంట్, అండ్ విజువల్ మ్యాజిక్ తో రిలీజయిన తర్వాతయినా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసి బంపర్ బాక్సాఫీస్ వసూళ్లు సాధిస్తుందా అనేది చూడాలిక.