Ponniyin Selvan : ఇప్పుడు చెప్పండ్రా సాంబార్ బాబులు.. తమిళ బాహుబలినా?
NQ Staff - September 30, 2022 / 03:00 PM IST

Ponniyin Selvan : మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోనియన్ సెల్వన్ కి పాజిటివ్ టాక్ దక్కింది. అయితే తమిళ మీడియా ప్రచారం చేసిన రేంజ్ లో మాత్రం సినిమా లేదు అనేది కొందరి అభిప్రాయం.
భారీ స్టార్ కాస్టింగ్ ఉండడం వల్ల సినిమా ఒకసారి చూడవచ్చు అంటూ రివ్యూవర్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారం జరుగుతుంది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తమిళ ప్రేక్షకులు కూడా పరవాలేదు అన్నట్లుగానే కామెంట్స్ చేస్తున్నారు కానీ ఆహా ఓహో అంటూ మాత్రం వారి నుండి స్పందన రావడం లేదు.
సినిమా విడుదలకు ముందు తమిళ్ మీడియా ఏకంగా ఇది బాహుబలిని బ్రేక్ చేసే సినిమా అంటూ ప్రచారం చేశారు. తమిళ బాహుబలి అంటూ కూడా ఆ సినిమాకు పేరు పెట్టుకున్నారు.
అంత ప్రచారం చేసినా కూడా బాహుబలి వసూళ్లలో కనీసం 25% వసూలు కూడా సాధించే పరిస్థితి లేదంటూ అప్పుడే ట్రేడ్ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఈ సినిమా రూ. 200 కోట్ల వసూళ్లను నమోదు చేస్తే చాలా గొప్ప విషయం అన్నట్లుగా ఇప్పుడు బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
తమిళనాడులో ఒక గౌరవప్రదమైన నెంబర్ ఈ సినిమాకు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఎటువచ్చి హిందీ మరియు తెలుగు వర్షన్లు ఎంతటి వసూలను సాధిస్తాయి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. బాహుబలి స్థాయి అన్నారు కనుక దాదాపుగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు సాధించాలి. మరి ఈ సినిమాకు అంత సీన్ ఉందా మీరే చెప్పండి సాంబార్ బాబులు.