Viral Video : వీడియో : భార్య పై నుండి కారు ఎక్కించిన నిర్మాత.. షాకింగ్‌ గా మారిన ఇష్యూ

NQ Staff - October 28, 2022 / 11:50 AM IST

Viral Video :  వీడియో : భార్య పై నుండి కారు ఎక్కించిన నిర్మాత.. షాకింగ్‌ గా మారిన ఇష్యూ

Viral Video : బాలీవుడ్ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా పై పోలీస్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. భార్య యస్మీన్ పై కారు ఎక్కించిన కారణంగా కిషోర్ మిశ్రా ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

కారులో వెళ్తున్న కిషోర్ ను భార్య యస్మీన్ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయం లో అతడు వినకుండా కారు ముందుకు వెళ్లనిచ్చాడు. దాంతో అదే సమయంలో ఆమె కారు కింద పడింది.

అయినా కూడా అతడు పట్టించుకోకుండా కారును ఆమె మీది నుండి తీసుకువెళ్లాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా కిషోర్ మిశ్రా ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వయిరీ చేస్తున్నారు.

భార్య భర్తల మధ్య గొడవ కారణంగా ఇది జరిగింది అంటూ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కిషోర్ మిశ్రా వీడియో వైరల్ అవుతుంది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో ని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us