RRR Team : ‘నాటు నాటు’కి గోల్డెన్ గ్లోబ్: ప్రధాని మోడీ ట్వీట్ వైరల్..

NQ Staff - January 11, 2023 / 12:38 PM IST

RRR Team : ‘నాటు నాటు’కి గోల్డెన్ గ్లోబ్: ప్రధాని మోడీ ట్వీట్ వైరల్..

RRR Team : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకిగాను ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు.

‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందిస్తూ ట్వీటేశారు. సంగీత దర్శకుడు కీరవాణి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, పాట రాసిన చంద్రబోస్‌లకు కాంప్లిమెంట్స్.. అంటూ పేర్కొన్నారు.

ప్రతి భారతీయుడికీ గర్వకారణం

PM Narendra Modi Tweeted Congratulating RRR Team

PM Narendra Modi Tweeted Congratulating RRR Team

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీయార్లకు ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రతి భారతీయుడ్నీ ఈ ప్రతిష్టాత్మక గౌరవం ఎంతో గర్వపడేలా చేసిందని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా సినిమా బౌండరీస్ అన్నీ చెరిగిపోయాయ్.. ఇండియన్ సినిమా ఘనత ఇదీ.. అని అంతా చెప్పుకుంటున్న సందర్భమిది. బాలీవుడ్ ప్రముఖులు ‘ఇండియన్ సినిమాకి దక్కిన అరుదైన గౌరవం..’ అని పేర్కొంటున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us