Super Stars : మొన్న చిరుతో సల్మాన్, కమల్.. ఇప్పుడు వెంకీ, సల్మాన్.. ఫ్రెండ్షిప్ అదుర్స్..!
NQ Staff - June 23, 2022 / 12:51 PM IST

Super Stars : ప్రస్తుతం సినీ ప్రముఖుల మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడు అంటీ ముట్టనట్టు ఉండేవారు ఇప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. ఒక పరిశ్రమ వారే కాదు ఇతర పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు కూడా చాలా స్నేహా భావంతో మెలుగుతున్నారు.
మంచి రోజులు..
ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్..ఇలా అన్ని చిత్రపరిశ్రమల్లోని హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక చిరంజీవి అయితే ఈ మధ్య అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు ప్రతి సినిమా ఈవెంట్స్‌కి హాజరవుతూ తన సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు.
ఇద్దరు సూపర్ స్టార్లతో ఓ మెగా స్టార్ పార్టీ చేసుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌లతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ పార్టీలో దిగిన ఫొటో ఇది. తన నెక్ట్స్ మూవీ కభీ ఈద్ కభీ దివాళీ మూవీ షూటింగ్ కోసం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు సల్మాన్ ఖాన్.

Photo Mega star Partying with Superstars
సల్లూభాయ్‌కు బ్రేక్ దొరికినట్టుంది. చిరు, వెంకీతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్టిల్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలకు స్నేహితుడైన జేసీ పవన్ రెడ్డి కూడా ఉన్నాడు. పవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీలో వెంకీ, చిరు, సల్మాన్ సందడి చేశారని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
1980, 90ల్లో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఏలిన ఈ ముగ్గురు స్టార్లు ఒక్కచోట చేరడం నిజంగా విశేషమే. ఇంతకుముందు కూడా కమల్ హాసన్ తన విక్రమ్ మూవీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అతనితో కలిసి చిరంజీవి ఇంటికెళ్లాడు సల్మాన్ ఖాన్. అప్పుడు ఈ ఇద్దరిని చిరు సన్మానించాడు. వీళ్లు అక్కడే డిన్నర్ చేస్తూ తమ పాత అనుభవాలను నెమరు వేసుకున్నారు. చిరంజీవి తర్వాతి సినిమా గాడ్‌ఫాదర్‌లో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు.