Payal Rajput : ఫాఫం.! పాయల్.! సన్నీలియోన్ దెబ్బకి సైడ్ అయిపోయిందే.!
NQ Staff - October 20, 2022 / 06:00 PM IST

Payal Rajput : ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బోల్డ్అండ్ బ్యూటిఫుల్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఆ బోల్డ్ ఇమేజ్‌ని పోగొట్టుకోవడానికి పాపం చాలానే కష్టపడిందనుకోండి. వెనకా ముందు చూడకుండా, వచ్చిన అవకాశాలను వచ్చినట్లే ఒప్పేసుకుని, ఆ తొందరపాటులో కెరీర్ పాడుచేసుకుందన్న విమర్శలు కూడా వున్నాయ్.
అయితే, తాజాగా ‘జిన్నా’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటూ సన్నీలియోన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్ అంటే ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది. కుర్రకారులో బోలెడంత క్రేజ్. దాంతో, ‘జిన్నా’ సినిమాని మొత్తంగా సన్నీలియోన్ యాంగిల్ నుంచే ప్రమోట్ చేస్తున్నారు.
పాయల్‌కి అన్యాయం జరిగిందే.!
నిజానికి లీడ్ హీరోయిన్ పాయల్ అయినప్పటికీ, పాయల్ పేరు చాలా తక్కువగా మాత్రమే వినిపిస్తోంది. సన్నీలియోన్ పేరు మాత్రం మార్మోగి పోతోంది. స్వాతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది ఈ సినిమాలో. ‘రేణుక’ అనే మరో పల్లెటూరి అమ్మాయి పాత్రలో సన్నీలియోన్ నటిస్తోంది.
స్వాతి పాత్ర కన్నా, రేణుక పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ వుండబోతోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఫాఫం.! ప్రమోషన్ల పరంగా పాయల్ రాజ్‌పుత్‌కి అంతలా అన్యాయం చేశారు ‘జిన్నా’ టీమ్. ఇక సినిమాలో అయినా పాయల్‌కి సీనుంటుందా.? లేదో.! అసలే ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం.. ఆచి తూచి ఎంపిక చేసుకున్నానంటూ ప్రామిసింగ్ మాటలు చెబుతోంది పాయల్ రాజ్‌పుత్. అసలు సంగతి తెలియాలంటే, కొద్ది గంటలు మాత్రమే వెయిట్ చేస్తే సరిపోతుంది.