Payal Rajput : పాయల్ ధమాకా.! ఈసారైనా హిట్టు కొడుతుందా.?

NQ Staff - July 25, 2022 / 03:00 AM IST

Payal Rajput : పాయల్ ధమాకా.! ఈసారైనా హిట్టు కొడుతుందా.?

Payal Rajput : ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది కూడా. కానీ, తన చేత్తో తన కెరీర్‌ని పూర్తిగా నాశనం చేసేసుకుంది. అర్థం పర్థం లేని సినిమాలు వరుసగా చేసేయడంతో.. ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడిపోయింది పాయల్ మీద.

Payal Rajput back to back movies

Payal Rajput back to back movies

చిత్రమేంటంటే, ఇంకెవరికైనా ఇలాంటి పరిస్థితి వుంటే.. కెరీర్ దాదాపుగా ముగిసిపోతుందిగానీ, పాయల్ మాత్రం ఇంకా ఇంకా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. అదే ఆమె స్పెషాలిటీ అనుకోవాలేమో. ఒకే ఒక్క ఛాన్స్.. ఈసారి పక్కాగా స్టార్ హీరోయిన్ అయిపోతానంటోంది పాయల్ రాజ్‌పుత్.

చేతిలో సినిమాలున్నాయ్‌గానీ..

‘జిన్నా’ సినిమాలోనూ, ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలోనూ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘జిన్నా’ సినిమాలో మంచు విష్ణు హీరో కాగా, ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలో ఆది సాయికుమార్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది పాయల్.

అయితే, ‘జిన్నా’ సినిమాకి సంబంధించి సన్నీలియోన్ పేరు మార్మోగుతోంది.. పాయల్ కంటే. ‘తీస్ మార్ ఖాన్’ విషయానికొస్తే, ఈ సినిమాపై అస్సలేమాత్రం బజ్ లేదు. సో, ఎలా చూసినా పాయల్ రాజ్‌పుత్ హిట్టు కొట్టడం కష్టమేనేమో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us