Payal Ghosh: ఎన్టీఆర్ స‌త్తా ఏంటో నాకు తెలుసు అంటూ పాయ‌ల్ స్ట‌న్నింగ్ కామెంట్స్

NQ Staff - February 12, 2022 / 11:52 AM IST

Payal Ghosh: ఎన్టీఆర్ స‌త్తా ఏంటో నాకు తెలుసు అంటూ పాయ‌ల్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Payal Ghosh: ఎన్టీఆర్ స‌త్తా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న న‌ట‌న‌, డ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌పై బాలీవుడ్ భామ‌లు కూడా తెగ ప్రేమ కురిపిస్తున్నారు.ఇప్ప‌టికే అలియా భ‌ట్.. ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తి చూప‌గా, తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొణే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది.

Payal Ghosh about NTR

Payal Ghosh about NTR


దక్షిణాది హీరోల్లో ఎవరితో నటించాలని కోరుకుంటారు? అని ప్రశ్నించగా, దీపిక టక్కున జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని చెప్పింది. ఎన్టీఆర్ తో చాన్స్ అంటే ఎగిరి గంతేస్తానని తెలిపింది. అతడిది అద్భుతమైన పర్సనాలిటీ అని కితాబునిచ్చింది. ఇక, దర్శకుల్లో ఎవరితో పనిచేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా, రాజమౌళి, అయాన్ ముఖర్జీల పేర్లు చెప్పింది.

ఆల్రెడీ ఎన్టీఆర్ అలియా భట్ కాంబో ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీపిక‌ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ మీద కామెంట్ చేసింది. గెహ్రాయాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా దీపక తెలుగు హీరోల మీద కామెంట్ చేసింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించింది.

ఎన్టీఆర్ ఆద్భుతమైన వ్యక్తి, ఆయన అద్భుతంగా నటిస్తాడు.. కలిసి నటించాలని అనుకుంటున్నాను అని దీపిక చెప్పుకొచ్చింది. ఇక ఈ కామెంట్ల మీద పాయల్ ఘోష్ స్పందించింది. ఓ రెండేళ్ల క్రితం మీరా చోప్రా ఎన్టీఆర్ తెలియదంటూ చేసిన కామెంట్లపై పాయల్ ఘోష్ ఎలా మండిపడిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఎన్టీఆర్ మీద దీపిక చేసిన కామెంట్లపై పాయల్ ఘోష్ సంతోషించినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్, మంచి మనిషి..అంతకు మించి ఆల్ రౌండర్ స్టార్.. ఇవన్నీ నేను ఎప్పుడో చెప్పాను.. కానీ నన్ను అందరూ విమర్శించారు.. నెగెటివ్‌గా మాట్లాడారు.. కానీ మొదటి నుంచి ఆయన సత్తా గురించి అదే చెబుతూ వచ్చాను.. ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తోంది.. నేను చెప్పింది ఎప్పుడూ తప్పు కాలేదంటూ పాయల్ ట్వీట్ వేసింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us