Pawan Kalyan : ఒక‌వైపు తల్లి, మ‌రోవైపు శ్రీమ‌తి.. ఆనందంతో ప‌వ‌న్ ద‌ర‌హాసం

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నా రూటే స‌ప‌రేట్ అంటాడు. ఆయ‌న ఫ్యామిలీ వేడుక‌లో పెద్ద‌గా క‌నిపించ‌రు, సినిమా వేడుక‌ల‌లో అయితే అది కూడా ఉండ‌దు. ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీబిజీగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. ఇటీవ‌ల కాస్త స‌మయం కుదుర్చుకొని ర‌ష్యా వెళ్లాడు ప‌వ‌న్.

Pawan Kalyan with wife and mother
Pawan Kalyan with wife and mother

పవన్ కళ్యాణ్ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కోసం రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. భార్య అన్నా లెజినోవా పిల్లలు రష్యాలో ఉండగా.. తిరిగి పవన్ కళ్యాణ్ భారత్ కు వచ్చారు. హైదరాబాద్ లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్ట‌గా, పవన్ కొత్తగా స్మార్ట్ లుక్ తో దర్శనం ఇచ్చాడు. తమ అభిమాన నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న త‌ల్లి, శ్రీమ‌తితో క‌లిసి స‌ర‌దాగా క‌నిపించాడు. ఈ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ పిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ప‌వన్ క‌ళ్యాణ్ త‌న పిల్ల‌ల‌ని, శ్రీమ‌తిని తిరిగి ఇండియా కి తీసుకొచ్చిన‌ట్టు ఈ పిక్‌ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు హిస్టారికల్ మూవీ హరిహర మల్లు షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో హరహర మల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి కూడా పవన్ ఒకే చెప్పాడు.