Pawan Kalyan Renu Desai : ప‌వ‌న్‌తో ఫొటో దిగ‌డం కోసం రేణూ దేశాయ్ అంత గ‌ట్టి ప్ర‌య‌త్నం చేసిందా?

NQ Staff - May 25, 2022 / 01:25 PM IST

Pawan Kalyan Renu Desai : ప‌వ‌న్‌తో ఫొటో దిగ‌డం కోసం రేణూ దేశాయ్ అంత గ‌ట్టి ప్ర‌య‌త్నం చేసిందా?

Pawan Kalyan Renu Desai : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కొన్ని జంట‌లు అభిమానుల మ‌న‌సుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ ఉంటాయి. అయితే ఆ జంట‌లు కొన్నాళ్ల‌కే విడిపోవ‌డం చాలా బాధ‌ని క‌లిగిస్తుంది. ప‌వ‌న్‌-రేణూ జంట‌ని చూస్తే ముచ్చ‌టేస్తుంటుంది. కాని వారి బంధం ఎన్నాళ్లో నిల‌వ‌లేదు. విడిపోయిన‌ప్ప‌టికీ మెగా అభిమానులు రేణూని త‌మ వ‌దిన‌లానే భావిస్తుంటారు.

విడిపోయిన‌ప్ప‌టి నుండి ఎన్న‌డు కూడా ప‌వ‌న్ -రేణూ జంట‌గా క‌నిపించ‌లేదు. కాని అకీరా నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి తల్లిదండ్రులుగా పవన్ – రేణూ కూడా హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో వారిద్ద‌రు క‌లిసి ఫోటో దిగారు. భార్యతో విడిపోయినా కూడా పిల్లల ఆనందం కోసం తండ్రిగా ఈ ఈవెంట్ కు వెళ్లినందుకు పవన్ ను అందరూ అభినందిస్తున్నారు.

ఫంక్షన్ కు మధ్యలో వచ్చినా.. మొత్తానికి అకీరా స్టేజీ మీదకు వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారని తెలుస్తోంది. ఈ పవన్ – రేణూ ఇద్దరూ తమ పిల్లలతో కలిసి ఫోటో కూడా తీసుకున్నారు. రేణూ స్వయంగా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ పిల్లల కోసం కలుసుకుంటున్నా.. ఎప్పుడూ కూడా వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ బయటకు రాలేదు.

ప్రస్తుతం అకీరా – ఆద్యాల‌తో పవన్ కళ్యాణ్ – రేణూ ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ పిక్ లో పవన్ కూడా ఉండాలని రేణూ దేశాయ్ చాలా ఆరాటపడిందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేయాలి కాబట్టి పవన్ ఒప్పుకుంటాడో లేదో అని తన పిల్లలతో ఈ విషయాన్ని చెప్పించిందని.. మొత్తం మీద తనతో పాటుగా మాజీ భర్తను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురాడానికి రేణూ చాలా ప్రయత్నం చేసిందని అంటున్నారు.

Pawan Kalyan Photos with Two Children Renudesai

Pawan Kalyan Photos with Two Children Renudesai

పవన్ కళ్యాణ్ మాత్రం దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకొని.. తన ఇద్దరు పిల్లలు మరియు మాజీ భార్యతో కలిసి ఫోటో దిగాడు అని చెబుతున్నారు. అయితే ఆ ఫోటో ఆడిటోరియంలో కాకుండా.. పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు బయట తీసుకున్న ఫోటో అని బ్యాగ్రౌండ్ చూస్తే అర్థం అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

‘బద్రి’ సినిమాలో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ జంట.. ఈ క్రమంలో ప్రేమించుకొని కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. అకీరా నందన్ పుట్టిన తర్వాత 2009 లో పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్ళ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2012లో విడాకులు తీసుకున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us