Pawan Kalyan Opened An Instagram Account : పవన్ ఇన్ స్టా ఓపెన్.. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా రికార్డు..!
NQ Staff - July 5, 2023 / 09:20 AM IST

Pawan Kalyan Opened An Instagram Account :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ గురించి ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఏ హీరోలకు లేనంత డైహార్డ్ ఫ్యాన్స్ కేవలం పవన్ కు మాత్రమే సొంతం.
అలాంటి పవన్ కల్యాణ్ నిన్న ఇన్ స్టాలోకి అడుగు పెట్టాడు. ఆయన ఇన్ స్టా అకౌంట్ ఇలా ఓపెన్ చేయగానే అలా ఫాలోవర్లు లక్షల్లో పెరిగిపోయారు. కేవలం 6 గంటల 45 నిముషాల లోపు వన్ మిలియన్ ఫాలోవర్లు సంపాదించుకుంది ఇన్ స్టా అకౌంట్. అయితే పవన్ కంటే వేగంగా 1 మిలియన్ ఫాలోవర్లు తెచ్చుకున్న వారు దాదాపు ప్రపంచంలో ఎనిమిది మంది ఉన్నారు.
పోస్టు పెట్టకుండానే..

Pawan Kalyan Opened An Instagram Account
వారి తర్వాత స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నాడు. ఇందులో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఉన్నాడు. అయితే వీరంతా కూడా ఏదో ఒక పోస్టుతో ఎంట్రీ ఇచ్చి ఫాలోవర్లను తెచ్చుకున్నారు. కానీ పవన్ మాత్రం ఎలాంటి పోస్టు పెట్టకుండానే ఇంత మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ కూడా పోస్టు పెట్టకుండా ఇలా ఫాలోవర్లను సంపాదించుకోలేదు. ఇలా చేసిన ఏకైక వ్యక్తిగా పవన్ కల్యాణ్ రికార్డు సృష్టించాడు. ఎంతైనా పవన్ ఫాలోయింగ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.