Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టైలింగ్.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఈ బీభత్సం.!
NQ Staff - October 2, 2022 / 09:46 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటేనే స్టైలింగ్.! ఈ మధ్యకాలంలో ఎందుకో ఆ స్టైలింగ్ మిస్ అవుతూ వస్తోంది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కావొచ్చు, ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో కావొచ్చు, స్టైలింగ్ విషయమై అభిమానుల్లో కొంత అసంతృప్తి వుంది.
మరి, ‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటి.? నిజానికి, ఈ సినిమాలో మోడ్రన్ స్టైలింగ్ కుదరదు. ఎందుకంటే, ఇది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా గనుక. అయితేనేం, అభిమానులకు పవన్ కళ్యాణ్ కావాల్సినంత స్టైలింగ్ ఇచ్చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్.. చాలా చాలా భిన్నంగా..!
రాజకీయాల్లోకి వెళ్ళాక ఎక్కువగా వైట్ డ్రెస్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటు మార్చారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం నిర్వహిస్తున్న వర్క్ షాప్‌కి పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్‌తో అటెండ్ అవుతున్నారు.
ఇది కూడా పబ్లిసిటీ వ్యూహమేనా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వర్క్‌షాప్‌కి ప్రాధాన్యత పెరిగింది. ఆ బజ్ మరింత పెంచుతున్నారు పవన్ కళ్యాణ్ తన తాజా స్టైలింగ్‌తో.
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.