Pawan Kalyan : 160 కోట్ల విలువైన స్థలంలో లగ్జరీ ఫామ్ హౌజ్ ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ?
NQ Staff - July 31, 2022 / 03:28 PM IST

Pawan Kalyan : ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రశాంతత కోసం ఎక్కువగా ఫామ్ హౌజ్‌కే పరిమితం అవుతారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేయడం, పశువుల పోషణ చూసుకోవడం ఆయనకు ఇష్టమైన చర్య. అందులో పండిన ఆర్గానిక్ పండ్లు ఇష్టమైన వారికి పంపడం పవన్ కున్న మరొక అలవాటు. కాగా చాలా కాలం క్రితమే ఆయన 16 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశారు.

Pawan Kalyan new farm house goen viral
భారీ ఖర్చుతో..
హైదరాబాద్ నగర శివారులో గల గండిపేట, చిలుకూరు మధ్య విస్తరించిన ఉన్న ఈ ల్యాండ్ లో పవన్ ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ శివారులోని గండిపేట – చిలుకూరు మధ్య వున్న 16 ఏకరాల ఫామ్ లాండ్ లో కొత్తగా ఫామ్ హౌస్ ని నిర్మించుకునే ప్లాన్స్ చేస్తున్నాడట.
సకల సౌకర్యాలతో మరో ఫామ్ హౌస్ ని నిర్మిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడున్న ఫామ్ లాండ్ ఒక్కో ఎకరం 10 కోట్ల వరకు వుంటుందని చెబుతున్నారు. అంటే 16 ఎకరాల విలువ మొత్తం 160 కోట్లుగా చెబుతున్నారు. మరి అలాంటి విలువైన చోట ఫామ్ హౌస్ అంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. మరి గండిపేట సమీపంలో ఫామ్ లాండ్ లో పవన్ కడుతున్న ఫామ్ హౌస్ ఖర్చు ఎంత అన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్ధులు పక్క రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గుంటూరు, మంగళగిరి మధ్య ఓ ఇంటిని నిర్మిస్తున్నారట. ఇక సినిమాకు యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ చాలా సులభం. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటించిన, చేస్తున్న చిత్రాలు అయోమయంలో పడ్డాయి. హరి హర వీరమల్లు పూర్తి చేయకుండానే ఆయన వినోదయ సిత్తం రీమేక్ మొదలుపెట్టారు.