Pawan Kalyan : పవన్ రాజమౌళి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా..?
NQ Staff - February 26, 2023 / 11:13 AM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్, రాజమౌళి.. ఇద్దరూ ఇద్దరే. పవన్ హీరోల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంటే.. రాజమౌళి డైరెక్టర్లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. సినిమాల పరంగా ఎవరి కెపాసిటీ వారిదే. పవన్ కల్యాణ్ సినిమాకు డైరెక్టర్ ఎవరా అనేది అస్సలు చూడరు. ఎందుకంటే అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందుకే పవన్ ను చూసి మార్కెట్ బిజినెస్ జరుగుతుంది.
అలాగే రాజమౌళి సినిమాల్లో కూడా హీరో ఎవరా అనేది చూడరు. ఇక్కడ రాజమౌళిని చూసి మాత్రమే సినిమా బిజినెస్ జరుగుతుంది. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా వీరిద్దరి కాంబోలో గతంలోనే ఓ సినిమా రావాల్సి ఉండేది. ఆ సినిమా ఏదో కాదు విక్రమార్కుడు.
పవర్ ఫుల్ స్టోరీతో..

Pawan Kalyan Missed Vikramarkudu Movie Directed By SS Rajamouli
పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని రాజమౌళి ఎంతగానో ప్రయత్నించారు. ఆయన కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీని రెడీ చేశారు. అదే విక్రమార్కుడు కథ. దీన్ని పవన్ కు చెప్పాలని బాగానే ప్రయత్నించారు. కానీ అప్పటికే పవన్ రెండేండ్ల వరకు వరుస మూవీలతో చాలా బిజీగా ఉన్నాడు.
దాంతో రాజమౌళికి ఆయనతో సినిమా చేసే ఛాన్స్ దొరకలేదు. దాంతో ఇదే కథను రవితేజను పెట్టి తీశాడు. ఆ మూవీ పెద్ద హిట్ అయిపోయింది. ఒకవేళ ఇదే మూవీ పవన్-రాజమౌళి కాంబోలో వచ్చి ఉంటే మాత్రం ఇండస్ట్రీ షేక్ అయిపోయేది. పవన్ రేంజ్ ఇంకా పెరిగేది. భవిష్యత్ లో అయినా వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని చాలామంది ఆశ పడుతున్నారు.