Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఖుషి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
NQ Staff - December 19, 2022 / 10:07 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతిపెద్ద సూపర్ హిట్ సినిమా ఏది అంటే ఎక్కువ శాతం మంది చెప్పే పేరు ఖుషి. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా అప్పట్లో ఖుషి సినిమా యొక్క సంచలనం అంతా ఇంతా కాదు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా రూపొందిన ఖుషి సినిమా కు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు.
ఏఎం రత్నం సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ మధ్య కాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదే క్రమంలో డిసెంబర్ 31 తారీఖున ఈ సినిమా ను సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సరికొత్త టెక్నాలజీకి అనుగుణంగా 4కే రెజల్యూషన్ తో ఆధ్యాత్మిక సౌండ్ సిస్టంతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకు రాబోతున్నారు. ఆ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ జల్సా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయం అంటున్నారు. డిసెంబర్ 31 తారీఖున పవన్ కళ్యాణ్ అభిమానులకు ఖుషి పండగ మరోసారి రాబోతుంది.