Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ని దాటేసిన పవన్ కళ్యాణ్.!
NQ Staff - January 1, 2023 / 12:22 PM IST

Pawan Kalyan : ఔను, పవన్ కళ్యాణ్‌ని పవన్ కళ్యాణ్ స్వయంగా దాటేశాడు. విషయమేంటంటే, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాని పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా దాటేసింది.
పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఖుషి’ బిగ్గెస్ట్ హిట్ సినిమా. ‘జల్సా’ సంగతి సరే సరి. అయితే, ఆ పాత వసూళ్ళ చర్చ కాదిక్కడ. ఈ మధ్య 4కె ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. రీ-రిలీజ్ పేరుతో 4కె ఫార్మాట్లో ఆయా హీరోల సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.. అదీ ప్రత్యేక ప్రదర్శనల రూపంలో.
‘ఖుషి’ సరికొత్త రికార్డ్..
‘జల్సా’ సినిమాని కొన్నాళ్ళ క్రితమే అట్టహాసంగా విడుదల చేశారు. అప్పట్లో 1.26 కోట్లు వచ్చాయి. వచ్చిన మొత్తంలో ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని ఛారిటీ కార్యక్రమం కోసం వినియోగించారు.
కాగా, తాజాగా ‘ఖుషి’ సినిమాని రీ-రిలీజ్ చేశారు. ఈసారి ‘జల్సా’ కంటే ఎక్కువ వసూళ్ళు వచ్చాయి. ఏకంగా ఈ సినిమా 1.63 కోట్లు కొల్లగొట్టింది.
అన్నట్టు, మహేష్ అభిమానుల కోసం ‘పోకిరి’ సినిమాని గతంలో విడుదల చేస్తే అది కేవలం 69 లక్షలు మాత్రమే కొల్లగొట్టగలిగింది.