Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్: ‘జల్సా’ ఈసారి డబుల్ డోస్.!

NQ Staff - August 25, 2022 / 09:07 AM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్: ‘జల్సా’ ఈసారి డబుల్ డోస్.!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం. ఇక, ఆయన బర్త్‌డే వేడుకల్ని ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ బర్త్‌డే. ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘జల్సా’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

Pawan Kalyan jalsa movie re release

Pawan Kalyan jalsa movie re release

‘4 కె’ ఫార్మేట్‌లో ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారట. ఈ ఫార్మేట్ రూపొందించడం కోసం చాలా కష్టపడ్డానని ఆయన హార్ట్ కోర్ ఫ్యాన్ సాయి రాజేష్ తెలిపారు. ‘కలర్ ఫోటో’ సినిమాకి దర్శకుడు సాయి రాజేష్. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.

రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ బద్దలవుతుందా.?

తన అభిమాన హీరో బర్త్ డే కోసం స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు ‘జల్సా’ సినిమాని రీ రిలీజ్ చేసి, ఆయనకు స్పెష్‌గా విషెస్ చెప్పాలనుకున్నాడట సాయి రాజేష్.

దాదాపు 500 ధియేటర్లలో ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జల్సా’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, పార్వతి మిల్టన్ గెస్ట్ రోల్ పోషించింది.

మ్యూజికల్‌గానూ సూపర్ హిట్‌గా నిలిచింది ‘జల్సా’ సినిమా. ఇలియానాకి కలర్స్ స్వాతి వాయిస్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 4కె ఫార్మేట్‌లో పక్కా క్వాలిటీతో రీ రిలీజ్ అవుతున్న ‘జల్సా’ మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us