Pawan Kalyan : ఇదేం క్రేజ్ సామీ.. రీ రిలీజ్ లోనూ జల్సా వరల్డ్ వైడ్ రికార్డ్
NQ Staff - August 31, 2022 / 11:30 AM IST

Pawan Kalyan : రీ రిలీజ్ లోనూ జల్సా క్రేజ్, సంజయ్ సాహు జోష్ ఏ మాత్రం తగ్గలేదు. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా జల్సా4kలో సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ రిలీజవుతున్నా కూడా ఫ్రెష్ రిలీజ్ కంటే ఎక్కువే రికార్డులు క్రియేట్‌చేస్తోంది జల్సా.

Pawan Kalyan Jalsa Movie re release record
పదీ, వందా కాదు.. ఏకంగా వరల్డ్ వైడ్ గా 501 ప్లస్ షోస్ పడుతున్నాయి. నెదర్లాండ్స్, మల్టా, బెల్జియం, డెన్మార్క్, జర్మనీ, యూకే ఇలా అనేక దేశాలతో పాటు 20 కి పైగా పక్కరాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో ఇప్పటికే స్పెషల్ షోస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసిందీ మూవీ. 22వేల డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయట ఇప్పటివరకూ.
త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ నటించిన ఈ మూవీ 2008 లో రిలీజై మంచి వసూళ్లతో పాటు ఇద్దరి కెరీర్ కి బూస్టప్ నిచ్చింది. అప్పటి క్రేజ్ కి తగ్గట్టుగా ఆడియెన్స్ లో ఓ మానియాను క్రియేట్ చేసింది. ఆ ఎక్స్ పెక్టేషన్స్ నే కంటిన్యూ చేస్తూ అత్తారింటికి దారేది మూవీ కూడా వీళ్ల కాంబోలోనే వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇక మామూలుగానే పవన్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కు పండగ. అలాంటిది ఇలా హిట్ మూవీ రీ రిలీజెస్ తో ఆ జోష్ ఇంకెంత డబులవుతుందో చెప్పక్కర్లేదు. సో.. ఈ సారి పవర్ స్టార్ బర్త్ డే కి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కొత్తలెక్కలతో, అభిమానుల హడావిడితో రచ్చరచ్చే.