Hari Hara Veeramallu : భారీ ధ‌ర‌కు అమ్ముడైన హ‌రిహర వీర‌మ‌ల్లు మ్యూజిక్ రైట్స్

Hari Hara Veeramallu : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో బాలీవుడ్ సంగీత సంస్థ‌లు హ‌వా చూపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు పెద్ద హీరోల మూవీ ఆడియో రైట్స్ ద‌క్కించుకోగా, తాజాగా టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు శాకుంతలం, హరిహర వీరమల్లు గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి.

Pawan Kalyan Hari Hara Veeramallu movie audio rights
Pawan Kalyan Hari Hara Veeramallu movie audio rights

ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ యాక్షన్- అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం, సంగీత దిగ్గజం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బాణీలు కడుతున్నారు.

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ మ్యూజిక్ హక్కులు కూడా టిప్స్ ఇండస్ట్రీస్ సొంతమయ్యాయి.

టిప్స్ మ్యూజిక్ అధినేతలు కుమార్ తౌరానీ, గిరీష్ తౌరానీ మాట్లాడుతూ : “ఎన్నో సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతటా ఎన్నో అద్భుతమైన భారీ చిత్రాలని నిర్మించిన సంస్థ టిప్స్, అంతే కాకుండా పాటలు, సంగీతాన్ని అందించిన టిప్స్ మ్యూజిక్.. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే నిబద్ధతతో ప్రస్తుతం తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించింది.

ఇకపై తెలుగు చిత్రాల ఆడియో హక్కులతో పాటు భారతీయ అన్ని భాషల ఆడియో హక్కులను కొనడానికి సిద్ధంగా వుంది. కేవలం భారీ చిత్రాలనే కాకుండా చిన్న చిత్రాలు సైతం మా సంస్థ ఆడియో విడుదల చేయడానికి ముందుంటుంది. శాకుంతలం, హరిహర వీరమల్లు వంటి అద్భుతమైన చిత్రాల ఆడియో హక్కులతో పాటు… మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ DTS (డేర్ టూ స్లీప్) మణి శంకర్, లాంప్, రా రా పెనిమిటి, ధగఢ్ సాంబా, పరమపద సోపానం, యు అర్ మై హీరో, ఈ రోజు టీజర్తో విడుదల అయినా మై నేమ్ ఈజ్ శృతి, చిత్రాల ఆడియో హక్కులు పొంది ఉన్నామని మీకు తెలియ చేస్తున్నాం.

ఇప్పటికే మా టిప్స్ యు ట్యూబ్ ఛానల్ కు 51 మిలియన్ సభ్యులు వున్నారు ప్రతి చిత్రం ప్రచారంలో భాగంగా చిన్న పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ప్రతీ సినీ ప్రేమికుడికి మా మాధ్యమం ద్వారా చేరుతుందని తెలియచేస్తూన్నాం. మా మిత్రుడు ఆడియో రంగంలో సుపరిచితుడు ‘సుప్రీం’ రాజు హార్వాణి సౌత్ ఇండియన్ మూవీస్ వ్యాపార లావాదేవులను నిర్వహిస్తారు. ప్రేక్షకులకు క్లాసీ, వినోదాత్మక సంగీతాన్ని అందించాలానే సంకల్పంతో టిప్స్ ఇండస్ట్రీస్ మునుకెళ్తోంది” అన్నారు.