Arjun : టాలీవుడ్ లో ఓ ఆసక్తికర కాంబినేషన్ రూపొందుతుంది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో కన్నడ సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ గా తెలుగులోనూ ఎంతో ఆదరణ పొందిన అర్జున్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కథా రచయిత, నిర్మాత కూడా అతనే.


క్యూట్ మూమెంట్స్..
చిత్రంలో అర్జున్ కూతురు ఐశర్య హీరోయిన్ కావడం మరో విశేషం. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’తో ఈ మధ్య మంచి హిట్ అందుకున్న విశ్వక్ ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అర్జున్ తో సినిమాకు పచ్చజెండా ఊపాడు. యాక్షన్ హీరోగా పేరున్న అర్జున్.. ఇతర హీరోల సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడిగా కూడా అతనికి అనుభవం ఉంది.

ఇప్పటికే పదికి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన అర్జున్ తాజా చిత్రంతో మరోసారి మెగాఫోన్ పడుతున్నాడు. ఈ చిత్రంతో తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు. అర్జున్ స్నేహితుడైన సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
- Advertisement -

ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్, అర్జున్‌కి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే అర్జున్ హాజరయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రొడక్షన్ నంబర్ 15గా వస్తున్న ఈ ప్రాజెక్టులో సాయిమాధవ్ బుర్రా రచయితా, రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా జాయిన్ అవుతున్న విషయాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

యాక్షన్ కింగ్ అర్జున్ కి తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు తన కెరియర్ ముగిసింది అనుకున్నప్పుడు, సొంత బ్యానర్లో సినిమా చేసుకుని మళ్లీ ఆయన గాడిలో పడిపోయారు. ఇప్పుడు అదే బ్యానర్లో తన కూతురికి హీరోయిన్ గా నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.