Pawan Kalyan : అల్లూరి విగ్రహావిష్కరణ : ఆహ్వానం అందినా పవన్ వెళ్ళరట.! ఎందుకంటే.!

NQ Staff - July 3, 2022 / 09:41 PM IST

Pawan Kalyan : అల్లూరి విగ్రహావిష్కరణ : ఆహ్వానం అందినా పవన్ వెళ్ళరట.! ఎందుకంటే.!

Pawan Kalyan : భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఆజాదీ కా అమృత మహోత్సవ్.. అలాగే అల్లూరి సీతారామరాజు జయంతి నేపథ్యంలో ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

Pawan Kalyan don't attend Alluri event

Pawan Kalyan don’t attend Alluri event

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తనకు బదలుగా పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని భీమవరం పంపుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

పవన్ కళ్యాణ్‌కి అందిన ఆహ్వానం..

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కూడా ఆహ్వానం అందింది. అయితే, పవన్ కళ్యాణ్ భీమవరం వెళతారా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ఆహ్వానం పంపినందున, పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారట. ఆ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారట.
జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ లేదా నాగబాబు ఈ కార్యక్రమానికి హాజరువుతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న అంశం. కానీ, వెళ్ళకపోతే.. బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ స్పష్టంగా తెలిసిపోతుందనే వాదన కూడా లేకపోలేదు.
ఇదిలా వుంటే, ‘జనవాణి’ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ విజయవాడ వెళితే, బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వచ్చారు. రేపు జనసేన హైద్రాబాద్‌కి తిరిగొచ్చేస్తే, ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌కి వెళుతుండడం ఒకింత ఆసక్తికరంగా మారుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us