Pawan Kalyan : దేనికి గర్జనలు? ప్రభుత్వంకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్నలు
NQ Staff - October 10, 2022 / 09:05 AM IST

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలను గుర్తించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా తన విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏం సాధించిందని గర్జనలు విజయోత్సవ సభలు సమావేశాలు నిర్వహిస్తుందంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు.
ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.. ఏం సాధించారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రశ్నలు, సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేనికి గర్జనలు?
రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?
దేనికి గర్జనలు?
మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?
దేనికి గర్జనలు?
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?
దేనికి గర్జనలు?
విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?