Pawan Kalyan : ఆంధ్రా థానోస్.! వైఎస్ జగన్‌కి కొత్త పేరు పెట్టిన జనసేనాని పవన్.!
NQ Staff - August 21, 2022 / 07:05 PM IST

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘దత్త పుత్రుడు’ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెటకారాలు చేస్తోంటే, ‘సీబీఐ దత్త పుత్రుడు వైఎస్ జగన్..’ అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

Pawan Kalyan comments on YSRCP YS Jagan
తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పేరు పెట్టారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. ఇకపై, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రా థానోస్ అని పిలుస్తామని చెప్పారు. ‘థానోస్ తానేదో మంచి చేసేస్తున్నానని అనుకుంటాడు. కానీ, అందర్నీ చంపేస్తుంటాడు..’ అంటూ జనసేన అధినేత వ్యాఖ్యానించారు.
తిరుపతిలో జనసేన జనవాణి..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాయలసీమలో పర్యటిస్తున్నరు. ఉమ్మడి కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన జనసేనాని, తాజాగా తిరుపతిలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు జవనాణి కార్యక్రమాన్ని జనసేనాని నిర్వహిస్తున్న విషయం విదితమే.
చదువుకుంటే ఉద్యోగులు రావడంలేదు.. వృద్ధులకు పెన్షన్లు అందడంలేదు.. వైసీపీ నేతల అరాచకాలకు సామాన్యులు బలైపోతున్నారంటూ అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో జనసేనాని విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని వైఎస్సార్ కోవర్టులే ముంచేశారంటూ తాజాగా మరోమారు జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.