Unstoppable Season 2 Show : అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌ లో పవన్‌ కళ్యాణ్‌ కన్ఫర్మ్‌

NQ Staff - October 7, 2022 / 02:18 PM IST

Unstoppable Season 2 Show : అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌ లో పవన్‌ కళ్యాణ్‌ కన్ఫర్మ్‌

Unstoppable Season 2 Show : నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్‌ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు.

బాలకృష్ణ మరియు చంద్రబాబు నాయుడు ముచ్చట్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అన్ స్టాపబుల్‌ సీజన్ 2 లో సందడి చేయబోతున్నాడు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఆహా టీం నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నాడని.. బాలకృష్ణతో ముచ్చట్లు పెట్టబోతున్నాడని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వచ్చే ఎపిసోడ్ ని ఈ సీజన్ యొక్క చివరి ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వారు భావిస్తున్నారట. సీజన్ 1 మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో చేయగా చివరి ఎపిసోడ్ ని మహేష్ బాబు తో పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

సీజన్ 1 కి మంచి ఎండింగ్ దకడంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే సీజన్ 2 కి కూడా మంచి ఎండింగ్ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉంటే తప్పకుండా సీజన్ 3 కి అంతకు మించి అన్నట్లుగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఆహా ఓటీటీ వారి యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us