Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నుంచి నాలుగు సినిమాలొస్తాయ్.!
NQ Staff - November 27, 2022 / 09:07 PM IST

Pawan Kalyan : అసలు నమ్మేలా వుందా ఇది.? కానీ, నమ్మాల్సిందేనట.! జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నుంచి వరుసగా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయట. అదీ, 2024 ఎన్నికల కంటే ముందేనట.!
ఇప్పటికైతే సెట్స్ మీద ఒకే ఒక్క సినిమా వుంది. అదే ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ఎంత వరకు పూర్తయ్యింది.? ఇంకెంత మిగిలి వుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కతోంది ‘హరిహర వీరమల్లు’.!
హరీష్ శంకర్ పరిస్థితేంటి.?
ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది పవన్ కళ్యాణ్‌తో. అది తమిళ సినిమా ‘వినోదియ సితం’కి రీమేక్. కానీ, అది పక్కకు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా అనౌన్స్ అయి వుంది.. సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి.. కానీ, వెళ్ళలేదు.
ఎంత వేగంగా అనుకున్నా పవన్ కళ్యాణ్ రెండు సినిమాలే పూర్తి చేయగలరు.. రానున్న రోజుల్లో సినిమాలకి డేట్స్ ఇచ్చి, రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టి.. అంత ఈజీ వ్యవహారం కాదిది.
సో , పైన చెప్పుకున్న మూడు సినిమాలూ వరుసగా నిర్మాణం పూర్తి చేసేసుకుంటాయనే అనుకుందాం.
నాలుగో సినిమా ఏంటి.? దాని గురించి అసలు ప్రచారమే లేదు కదా.? ఏమో, ఏదైనా జరగొచ్చునన్నది పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశ.