Pawan Kalyan And Harish Shankar : అటకెక్కిన భవదీయడు! మరో కొత్తకథ, మరో ప్రాజెక్ట్. ఇదైనా పట్టాలెక్కేనా పవన్?

NQ Staff - November 23, 2022 / 10:09 PM IST

Pawan Kalyan And  Harish Shankar : అటకెక్కిన భవదీయడు! మరో కొత్తకథ, మరో ప్రాజెక్ట్. ఇదైనా పట్టాలెక్కేనా పవన్?

Pawan Kalyan And Harish Shankar : కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులు ముందుకు మూడడుగులేస్తే, ఎనక్కి ఏడడుగులేస్తున్నాయి. ఆ లిస్టులో టాప్ ప్లేసులో ఉన్న మూవీ భవదీయుడు భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షనులో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రం అనౌన్సయిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీటవుతుండడంతో ఇండస్ట్రీ అంతా ఎగ్జయింటింగ్ గా వెయిట్ చేసింది.

పవన్ స్టయిలిష్ లుక్స్ తో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే సరికి ఫ్యాన్స్ ఎన్నో రోజులనుంచి మరో అప్ డేట్ కోసం ఆశగా ఎదురుచూశారు. మొత్తానికి ఇన్నాళ్లకు అప్ డేటొచ్చింది. కానీ సినిమా ప్రోగ్రెస్ గురించి కాదు. ప్రాజెక్టే ప్రస్తుతానికి ఆగిపోయిందని. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలోనే అదే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే పవన్ మరో మూవీ చేయనున్నాడట. సో.. భవదీయుడు భగత్ సింగ్ కాకుండా ఈసారి కొత్త కథ, కొత్త కాన్సెప్టుతో కొత్త సినిమా అనమాట. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే డిసెంబరులో ముహూర్తం షాటుకి ప్లాన్ చేస్తున్నారట.

సరే.. ఒకటి కాకపోతే ఇంకోటి..

వీరిద్దరి కాంబినేషన్లో అయితే సినిమా వస్తోంది కదా అని ఫ్యాన్స్ సంబరపడేలోపే మరికొన్ని ప్రాక్టికల్ డౌట్స్ వాళ్లని డల్లయ్యేలా చేస్తున్నాయి. ఇప్పటికే సెట్స్ పై ఉన్న హరిహరవీరమల్లు అనుకున్న దానికన్న ఎక్కువ టైమ్ తీసుకుంటోంది. పీరియాడికల్ మూవీ కావడంతో షూటింగుకి కూడా సమయం ఎక్కువే పడుతోంది. క్రిష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా మేకింగ్ విషయంలో కాంసంట్రేట్ చేస్తూ బెటర్ అవుట్ పుట్ కోసమే కష్టపడుతున్నాడట. కానీ పరిస్థితి చూస్తుంటే షూట్ ఫినిషవడానికే ఇంకొన్ని నెలలు కూడా పట్టేలా ఉంది.

మరోవైపు వినోదయ సిత్తయం రీమేక్ పూజా కార్యక్రమాలు అప్పుడెప్పుడో పూర్తి చేసుకున్నా షూట్ మాత్రం పెద్దగా ముందుకెళ్లింది లేదు. సెట్స్ పైకొచ్చిన ఈ ప్రాజెక్టులే ఎటూ తేలడం లేదంటే మరోవైపు సుజిత్ దర్శకత్వంలో పవన్ మరో కొత్త సినిమా త్వరలోనే అఫీషియల్ గా అనౌన్సవుతుందన్న టాక్ కూడా లేకపోలేదు.

ఇంకోవైపు యాత్రలు, పోరాటాలు, సభలు, సమావేశాలంటూ పవన్ ఓవైపు పాలిటిక్సులోనూ స్పీడు పెంచాడు. ఎలక్షన్లు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీపై, పవరులోకి రావాలన్న ఆశతో రాజకీయాలపై ఇంకాస్త ఫోకస్ చేయడం పక్కా.

Pawan Kalyan Another Movie Direction of Harish Shankar

Pawan Kalyan Another Movie Direction of Harish Shankar

ఈ లెక్కన అటు పాలిటిక్స్, ఇటు షూటింగ్సుతో స్టార్టయిన ప్రాజెక్టుల్ని ఫినిష్ చేసి, రిలీజ్ చేసి, మళ్లీ ఇంకో కొత్త సినిమా పూర్తిచేసే సరికి ఎన్నేళ్లు పట్టనుందో మరి?
భవదీయుడు భగత్ సింగ్ పై భారీ ఆశలు పెట్టుకుంటే ఇప్పుడు అది కాదు కొత్తగా ఇంకో మూవీ అంటే.. ఇన్ని ప్రయారిటీల మధ్య పవన్, హరీష్ సినిమా పట్టాలెక్కి, థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వడానికి బా..గా సమయం పట్టడం పక్కా. సరే.. సమయం తీసుకున్నా సరే గానీ.. కనీసం ఈ సారయినా భారీ హైప్ పెంచాక భవదీయుడిలా అటకెక్కడం కాకుండా సెట్స్ పైకెక్కేలా ఓకే అనిపిస్తే పీకే ఫ్యాన్స్ హ్యాపీ ఇక.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us