Nikesha Patel : పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కి ‘ఆర్ఆర్ఆర్’ నచ్చలేదట.! ఎందుకో మరి.!

NQ Staff - October 5, 2022 / 08:42 AM IST

Nikesha Patel : పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కి ‘ఆర్ఆర్ఆర్’ నచ్చలేదట.! ఎందుకో మరి.!

Nikesha Patel :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కొమరం పులి’ సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? భారతీయ మూలాలున్న బ్రిటిష్ బ్యూటీ ఆమె. ఆ అందాల భామ ఎవరో కాదు, నికీషా పటేల్.

బ్యాక్ టు బ్యాక్ తెలుగులో ఫెయిల్యూర్స్ చవిచూసి, ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో ట్రై చేసి, ఎక్కడా వర్కవుట్ కాక, తిరిగి బ్రిటన్ చెక్కేసిన నికీషా పటేల్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది.

‘ఆర్ఆర్ఆర్’ మూవీ అభిమానుల్ని కెలికిందేలా.?

ఆర్ఆర్ఆర్’ సినిమాని ఈ మధ్యనే నికీషా పటేల్ చూసిందట. సినిమా ఆమెకు అస్సలు నచ్చలేదట. నచ్చలేదన్న విషయాన్ని తాను ధైర్యంగా చెబుతున్నానంటూ ఓ ట్వీటేసింది నికీషా పటేల్.

సరే, ఆమెకు నచ్చడం, నచ్చకపోవడం అనేది ఆమె విజ్ఞత. ఆమె టేస్ట్ అలాంటిదని సరిపెట్టుకోవాల్సిందే. కానీ, పనిగట్టుకుని నచ్చలేదని.. అది కూడా సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలన విజయాన్ని అందుకున్నాక చెప్పడమంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే.

ఏదో ఒక పిచ్చి కామెంట్ చేస్తే, తనను ట్రోల్ చేస్తారనీ.. ఆ తర్వాత సింపతీ కార్డుని తెరపైకి తేవాలనీ బహుశా నికీషా పటేల్ అనుకుంటోందేమో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us