Pavitra Lokesh : వివాదంలో ప‌విత్ర లోకేష్‌.. రెండు సినిమాల నుండి త‌ప్పించినట్టు టాక్..!

NQ Staff - July 6, 2022 / 07:00 PM IST

Pavitra Lokesh : వివాదంలో ప‌విత్ర లోకేష్‌.. రెండు సినిమాల నుండి త‌ప్పించినట్టు టాక్..!

Pavitra Lokesh : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్ర లోకేష్ కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ముఖ్యంగా న‌రేష్‌ని నాలుగో పెళ్లి చేసుకోనుందంటూ జోరుగా ప్ర‌చారాలు చేశారు. ఈ విష‌యంలో న‌రేష్ మూడో భార్య ర‌మ్య ఆమెపై చెప్పుతో దాడి చేసేందుకు కూడా వెనుకాడ‌లేదు. కొద్ది రోజులుగా ఈవిష‌యంపై జోరుగా చర్చ‌లు న‌డుస్తున్న నేప‌థ్యంలో ప‌విత్రకి సంబంధించి కొన్ని వార్త‌లు ఇప్పుడు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

నో ఆఫ‌ర్స్..

కర్ణాటకకు చెందిన పవిత్ర లోకేష్ మొదట కన్నడ సినిమాలోని మంచి హీరోయిన్ గా గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. కేవలం 16 వేళ్ళ వయసులోనే ఆమె వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. 20 ఏళ్లు రాకముందుకే దాదాపు కన్నడలో 150 సినిమాలు కూడా చేసింది అప్పట్లో ఆమెకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది.

మొదట పవిత్ర లోకేష్ ఒక సాఫ్ట్ వేర్ ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్నాళ్లకు అతనితో విడిపోయింది. ఆ తర్వాత ఆమె సుచెంద్ర ప్రసాద్ తో కూడా ప్రేమలో ఉన్నట్లుగా కథనాలు వెలుపడ్డాయి. అతని నుంచి కూడా ఆమె 2018లో విడిపోయింది. గ‌త ఏడాది నుంచి ఆమె యాక్టర్ నరేష్ తో సాన్నిహితంగా ఉన్నట్లు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి.

Pavitra Lokesh Movies Getting Cancelled

Pavitra Lokesh Movies Getting Cancelled

ఇక ఎప్పటికప్పుడు పవిత్ర లోకేష్ ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ వార్తలు ఇండస్ట్రీలో కూడా చర్చన్యూయంశంగా మారిపోయాయి.ఈ తరుణంలో పవిత్ర లోకేష్ చేయాల్సిన కొన్ని సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య, శర్వానంద్ ఇలా చాలామంది హీరోలకు తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. నటన విషయంలో అయితే ఆమె బెస్ట్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం నరేష్ తో జరుగుతున్న వ్యవహారంతో ఆమె తల్లి పత్రాలు చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రెండు పెద్ద చిత్రాల్లో ఆమె ఆఫర్స్ కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. మ‌రి వీటిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us