Pavithra Lokesh : ఆస్తి చూసి కాదు.. నరేశ్ ను చూసి పడిపోయా.. పవిత్ర లోకేష్ కామెంట్లు వైరల్..!
NQ Staff - June 6, 2023 / 09:53 AM IST
Pavithra Lokesh : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే కేవలం సీనియర్ నరేశ్-పవిత్ర లోకేష్ మ్యాటర్ అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ కలిసి చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి డేటింగ్ ను వీరే కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి బహిరంగంగానే ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. వెకేషన్లకు కూడా వెళ్తున్నారు.
ఇక వీరిద్దరూ కలిసి నటించిన మూవీ మళ్లీపెళ్లి. వీరిద్దరి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో వీరిద్దరూ కలిసి చాలా విషయాలను పంచుకున్నారు. ఇక పిల్లల విషయంలో కూడా వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. పిల్లల్ని కనడానికి మేం రెడీగా ఉన్నామని తెలిపారు.
ఇక పవిత్ర మీ ఆస్తిని చూసి పడిందా లేక మీకు పడిందా అని నరేశ్ ను ప్రశ్నించగా.. ఆమె కేవలం నాకోసమే వచ్చింది అంటూ తెలిపాడు నరేశ్. ఇదే ప్రశ్నపై తాజాగా పవిత్ర కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను కేవలం నరేశ్ కోసమే వచ్చాను. అంతే గానీ ఆయన ఆస్తి ఎంత అనేది కూడా నాకు తెలియదు.
ఆయనలో నాకు నచ్చింది నాకు సపోర్టుగా నిలవడం. అదే నన్ను ఆయన వెంట వచ్చేలా చేసింది. అంతే తప్ప ఇప్పటి వరకు నేను ఆయన ఆస్తి గురించి ఎన్నడూ అడగలేదు. మేమిద్దరం ఒక మంచి అండర్ స్టాండింగ్ మీద ఉన్నాం. త్వరలోనే పెండ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాం. మేం ఎప్పటికీ కలిసే ఉంటాం అంటూ తెలిపింది పవిత్ర.