Pavithra Lokesh : నాకూ, నరేష్‌కీ మద్దతివ్వండి: పవిత్ర లోకేష్ సంచలనం

NQ Staff - July 1, 2022 / 07:42 PM IST

Pavithra Lokesh : నాకూ, నరేష్‌కీ మద్దతివ్వండి: పవిత్ర లోకేష్ సంచలనం

Pavithra Lokesh : ‘ఆమెకి తన భర్తతో గొడవ వుంటే, ఇంట్లో పెద్దవాళ్ళతో తేల్చుకోవాలి.. లేదంటే, కోర్టును, పోలీసులను ఆశ్రయించవచ్చు. ఏదైనా, హైద్రాబాద్‌లోనే చూసుకోవాలి.. బెంగళూరు రావడమేంటి.?’ అంటూ సీనియర్ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి పవిత్ర లోకేష్.

లేటు వయసులో నరేష్, రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ మధ్య ఈ ఘాటు వివాదమేమిటోగానీ, ఎవరు ఎవరికి భార్య.? ఎవరు ఎవరికి భర్త.? ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారు.? అనేది ఎవరికీ అర్థం కావడంలేదు. చట్టబద్ధంగా అయితే, నరేష్ – రమ్య రఘుపతి మధ్య వివాహ బంధం వుంది.

మధ్యలో పవిత్ర లోకేష్ అత్యుత్సాహమేంటి.?

Pavithra Lokesh Latest Video

Pavithra Lokesh Latest Video

పవిత్ర లోకేష్ మీద రమ్య రఘుపతి ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం. ‘ఆమె ఆరోపణల్లో అర్థం లేదు..’ అని పవిత్ర లోకేష్ తప్పు పట్టడం సబబే కావొచ్చు. కానీ, భార్యాభర్తల గొడవల్లో పవిత్ర లోకేష్ ఏ హక్కుతో తలదూర్చుతున్నారు.? అన్నదే ఇక్కడ ప్రశ్న.

‘ఈ విషయంలో నాకు, నరేష్‌కీ మీరంతా మద్దతివ్వండి..’ అని పవిత్ర లోకేష్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. తెలుగులో మాట్లాడటంలో కొంత ఇబ్బంది పడే పవిత్ర, ఆ క్రమంలోనే చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయారా.? లేదంటే, కావాలనే ‘నాకు, నరేష్‌కూ..’ అంటూ ఇద్దర్నీ కలిపేసుకున్నారా.? అన్నదే ఇక్కడ కీలకం.

చట్ట ప్రకారం అయితే, ఆలు మగల మధ్యకు ఇంకెవరైనా వస్తే, అది క్రిమినల్ చర్య అవుతుంది.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us