Panch Prasad : జబర్దస్త్ కమెడియన్.! నడవలేని స్థితిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ‘పంచ్’ ప్రసాద్.!
NQ Staff - November 18, 2022 / 06:30 PM IST

Panch Prasad : జబర్దస్త్ అంటేనే నవ్వుల షో. తనదైన కామెడీతో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తే ఈ ఆర్టిస్టుల రియల్ జివితాల్లో చెప్పుకోలేని తీవ్రమైన బాధలున్నాయ్.
మనసులోని బాధని పంటి చాటునే బిగియ గట్టి. ముఖంపై చిరునవ్వుతోనే మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంటారీ నవ్వుల రారాజులు. పంచ్ ప్రసాద్‌గా జబర్దస్త్‌లో పేరు తెచ్చుకున్న ప్రసాద్ చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
గెట్ వెల్ సూన్ పంచ్ ప్రసాద్..
చాలా షోల్లో తన అనారోగ్యం గురించి చెప్పేవాడు పంచ్ ప్రసాద్. నయం కాని తీవ్రమైన జబ్బుతో బాధపడుతూనే అప్పుడప్పుడూ తనపైనే పంచ్ డైలాగులు వేసుకునేవాడు ప్రసాద్. వారం వారం డయాలసిస్ చేయించుకుని మరీ, అట్నించి అటే షూటింగులకు హాజరైన సందర్భాలు కూడా అనేకం అంటూ, ప్రసాద్ గురించి పలుమార్లు తోటి కంటెస్టెంట్లు పలుమార్లు చెప్పిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలుస్తోంది. ఒకరోజు షూటింగ్ నుంచి జ్వరంగా వుందని ఇంటికొచ్చిన ప్రసాద్ తీవ్రమైన నడుం నొప్పితో బాధపడ్డాడట. కాస్సేపటికే నడవలేక చాలా ఇబ్బంది పడ్డారట. వైద్యులు టెస్టులు చేసిన తర్వాత నడుం వెనక వెన్నెముక నుంచి కుడికాలి వరకూ చీము పట్టేసిందని డాక్టర్లు చెప్పారట.. ఆయన్ని పలకరించడానికి వెళ్లిన నూకరాజు తదితర జబర్దస్త్ కమెడియన్లతో ప్రసాద్ భార్య ఈ విషయం తెలిపి బాధపడిందట.
ప్రసాద్‌కి ఇష్టం లేకుండానే, తన ఆరోగ్య పరిస్థితిని చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మరో కమెడియన్ నూకరాజు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసాద్ తొందరగా కోలుకోవాలని మరోన్నో నవ్వులు పూయించాలని అభిమానులు కోరుకుంటున్నారు.