Kalyan Ram and NTR : ఎన్టీఆర్‌తో క‌ళ్యాణ్ రామ్ పాన్ ఇండియా సినిమా.. లేట్ అయిన లేటెస్ట్‌గా వ‌స్తాం..

NQ Staff - August 3, 2022 / 02:46 PM IST

Kalyan Ram and NTR  : ఎన్టీఆర్‌తో క‌ళ్యాణ్ రామ్ పాన్ ఇండియా సినిమా.. లేట్ అయిన లేటెస్ట్‌గా వ‌స్తాం..

Kalyan Ram and NTR  : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా, హీరోగా స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. త‌న ప్ర‌తి సినిమాలోను ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. కళ్యాణ్ రామ్ మొదటి నుంచి ప్రయోగత్మాక సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓం త్రీడి అనే సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆర్ధికంగా దెబ్బతీసింది..

సినిమాపై హోప్..

బింబిసార సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నారు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్. క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Pan India Film with Kalyan Ram and NTR Excellent Script

Pan India Film with Kalyan Ram and NTR Excellent Script

ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డ‌మే కాకుండా మూవీపై అంచ‌నాలు పెంచేలా మాట్లాడారు. ఇక క‌ళ్యాణ్ రామ్ కూడా వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. అయితే ఇటీవ‌ల టాలీవుడ్‌లో వ‌చ్చిన వ‌రుస ఫ్లాపుల గురించి మాట్లాడుతూ.. ప్ర‌తి సినిమాకి మౌత్ టాక్ అనేది చాలా ముఖ్యం. మొద‌ట వ‌చ్చే టాక్ సినిమాని నిల‌బెడుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ఇక బింబిసార చిత్రం క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాను. చాలా కాలం తర్వాత వచ్చే నా సినిమా ఇండస్ట్రీలో, నాకు కెరీర్లో మంచి హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇక ఎన్టీఆర్‌తో కాస్త ఆల‌స్యం అయిన కూడా గొప్ప స్క్రిప్ట్‌తో పాన్ ఇండియా సినిమా చేస్తాను. అది ప్రేక్ష‌కులు మెచ్చేలా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us