OTT : బిగ్ ట్విస్ట్.! ఓటీటీని సైతం లైట్ తీసుకుంటున్నారా.?
NQ Staff - August 12, 2022 / 01:23 PM IST
OTT : ‘సినిమా ఫ్లాపయితే ఓ వారం లేదా రెండు వారాల్లోపే ఓటీటీలో వచ్చేస్తుందిలే..’ అన్న అభిప్రాయం సినీ అభిమానుల్లో పెరగడంతో కొన్ని సినిమాలకు టాక్ బాగానే వున్నా, థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శితం కాలేకపోయాయి. అలా థియేటర్లను జనం లైట్ తీసుకున్నారు. దాంతో, ఓటీటీ పండగ చేసుకుంది.
చిత్రమేంటంటే, ఈ మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాలకు ఓటీటీ వ్యూస్ కూడా గణనీయంగా పడిపోతున్నాయట. ‘పక్కా కమర్షియల్’ సినిమానే ఇందుకు నిదర్శనం. ‘చెత్త కామెడీ..’ అంటూ సినిమా స్టార్ట్ అయిన కాస్సేపటికే దాన్ని వదిలేస్తున్నారు.
అందుకే థియేటర్లకు జనం పెరుగుతున్నారా.?
థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా.! ఈ అభిప్రాయం చాలామందిలో వుంటుంది. అయితే, పెరిగిన టిక్కెట్ ధరల నేపథ్యంలో థియేటర్ల వైపు సామాన్యులు చూడటం మానేశారు. ‘మేం టిక్కెట్ ధరల్ని పెంచడంలేదు..’ అని సినీ జనాలు చెప్పుకోవాల్సి వచ్చింది.
సో, టిక్కెట్ల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చిందన్నమాట. దాంతో, థియేటర్ల వైపు జనం వెళుతున్నారు. అటు ఓటీటీకి దెబ్బ పడటం, ఇటు థియేటర్లకు జనం వస్తుండడం వెరసి.. ఇదో చిత్రమైన పరిస్థితి. కానీ, ఓటీటీని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
కాగా, పెద్ద సినిమాలు ఇకపై వెంటనే ఓటీటీలో వచ్చే అవకాశం లేదు. అలాగని పరిశ్రమ ఇప్పటికే ఓ తీర్మానం చేసుకుంది. కానీ, ఇక్కడా ఓ సమస్య వుంది. ఓటీటీ డీల్స్ గణనీయంగా పడిపోతే, మళ్ళీ ఇక్కడ నష్టపోయేది నిర్మాతే.!