Orange Theme Stars : మరోసారి కలిసిన 1980 స్టార్స్.. ఈసారి మరింత కన్నుల విందు
NQ Staff - November 13, 2022 / 06:23 PM IST

Orange Theme Stars : తెలుగు, తమిళ మరియు ఇతర భాషలకు చెందిన 1980 స్టార్స్ ప్రతి సంవత్సరం యూనియన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వీరి యొక్క రీ యూనియన్ కార్యక్రమం జరుగుతుంది.
అయితే కరోనా కారణంగా వీరి యొక్క రీ యూనియన్ కార్యక్రమం గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ముంబైలో వీరి యొక్క రీ యూనియన్ కార్యక్రమం ఈ సంవత్సరంకు గాను జరిగింది.

Orange Theme Stars Appeared And Created Buzz
ముంబై లోని ప్రముఖ ప్రాంతం లో ఈ కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈసారి ఒకప్పటి స్టార్ పూనమ్ ధిల్లాన్ నిర్వహించినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం గా 40 మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

Orange Theme Stars Appeared And Created Buzz
ఈసారి ఆరెంజ్ థీం తో స్టార్స్ అంత కనిపించి సందడి చేశారు. తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సీనియర్ నరేష్, భానుచందర్ లతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ ఇంకా కొందరు తమిళ స్టార్స్ హిందీ స్టార్స్ మరియు హీరోయిన్స్ నదియా, రాధా, రమ్యకృష్ణ, రాధిక, కుష్బూ, సుహాసిని, సుమలత ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.