Oke Oka Jeevitham Movie : ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ డే వసూళ్ళ వివరాలివే.
NQ Staff - September 10, 2022 / 02:03 PM IST

Oke Oka Jeevitham Movie : తొలి రోజే మంచి టాక్ తెచ్చుకుంది శర్వానంద్ సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాలో మాజీ హీరోయిన్ అమల ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం విదితమే. ఉదయం నామమాత్రపు ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రానికి వసూళ్ళు పుంజుకున్నాయ్.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 75 లక్షల షేర్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఓవర్సీస్‌లో 101 కె డాలర్లు వసూలు చేసింది. కాగా, కర్నాటక అలాగే తమిళనాడు సహా దేశవ్యాప్తంగా 10 లక్షల పైన వసూలు చేసినట్లు చెబుతున్నారు.
బ్రేక్ ఈవెన్ 8 కోట్లు..
మొత్తంగా సినిమా తెలుగు వెర్షన్ బిజినెస్ ఏడున్నర కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ కోసం 8 కోట్లు వసూలు చేయాల్సి వుంది. అంటే, మరో ఆరు కోట్ల డెబ్భయ్ లక్షల వరకు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

Oke Oka Jeevitham Movie First Day Collection
నైజాం ఏరియాలో రెండున్నర కోట్లు, సీడెడ్ ప్రాంతంలో 0.8 కోట్లు, ఆంధ్రాలో 3.2 కోట్లు, వెరసి ఏపీ, తెలంగాణల్లో ఆరున్నర కోట్లు, తమిళనాడు సహా కర్నాటక మిగతా ప్రాంతాల్లో (ఇండియా మొత్తమ్మీద) కోటి రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా, 8 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, క్లాస్ ఆడియన్స్ సినిమాని ఆదరిస్తుండడంతో క్రమంగా వసూళ్ళు పుంజుకుంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.