NTR : ఎన్టీఆర్ అప్పుడే చెప్పాడు నయన్‌ కి పుట్టేది కవల పిల్లలు అని..!

NQ Staff - October 10, 2022 / 09:02 AM IST

NTR : ఎన్టీఆర్ అప్పుడే చెప్పాడు నయన్‌ కి పుట్టేది కవల పిల్లలు అని..!

NTR : నయనతార, విగ్నేష్ శివన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరు కొడుకులకు తల్లిదండ్రులైన నయనతార మరియు విగ్నేష్ శివన్‌ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సమయంలో ఎన్టీఆర్ యొక్క అదుర్స్ సినిమాలోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ నయనతారతో ఎన్టీఆర్ మాట్లాడుతూ మీకు కవల పిల్లలు జన్మిస్తారు అంటూ డైలాగ్ చెప్తాడు.

ఆ డైలాగ్ లో ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఇప్పుడు నిజంగానే నయనతార కవల పిల్లలకు జన్మనిచ్చింది.. ఎన్టీఆర్ మాట నిజమైంది. ఆయన బ్రాహ్మణ వేషంలో ఉండి పలికిన పలుకులు నిజమయ్యాయి అంటూ చాలా మంది నందమూరి అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఎన్టీఆర్ యొక్క అభిమానులను ఆకర్షిస్తుంది. ఎన్టీఆర్ ఎన్నో సంవత్సరాల క్రితం అన్నట్లుగా నయనతార ఇప్పుడు ఇద్దరు కొడుకులకు కవల పిల్లలకు జన్మనిచ్చిందంటూ అభిమానులు తెగ మురిసి పోతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది, ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. కథ, స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం చర్చల దశలో ఉందని ఈ ఏడాది చివరిలో కచ్చితంగా సినిమా ప్రారంభం అవ్వబోతుంది అంటూ ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో లేదా దసరాకి ఎన్టీఆర్ 30 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us