NTR : ‘బ్రహ్మాస్త’ రగడ: ఎన్టీయార్‌పై మంటతోనే అనుమతి ఇవ్వలేదా.?

NQ Staff - September 3, 2022 / 08:37 AM IST

156434NTR : ‘బ్రహ్మాస్త’ రగడ: ఎన్టీయార్‌పై మంటతోనే అనుమతి ఇవ్వలేదా.?

NTR : కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఇటీవల హైద్రాబాద్‌లో పర్యటించినప్పుడు, ఆ పర్యటన సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావునీ అలాగే సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌నీ విడివిగా కలిసిన విషయం విదితమే.

NTR joins with Brahmastra pre release event

NTR joins with Brahmastra pre release event

ఆ రామోజీరావుకి చెందిన ఫిలిం సిటీలో, యంగ్ టైగర్ ఎన్టీయార్ ముఖ్య అతిథిగా బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి వుండగా, దానికి తెలంగాణ పోలీస్ అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీయార్ అభిమానుల గుస్సా..

‘మర్యాదపూర్వకంగా కలిశాడు తప్ప, మీలాగా తెరవెనుక రాజకీయాలు చేయడం ఆయనకు చేతకాదు రా.. త్వరలో చూస్తారులే పరిణామం..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు, తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీపై గుస్సా అవుతున్నారు.

సిటీ బయట ట్రాఫిక్ లేని చోట జనాన్ని కంట్రోల్ చెయ్యడానికి సమస్య ఏంటి.? అని మరో ఎన్టీయార్ అభిమాని ప్రశ్నించడం గమనార్హం. ‘ఓ కమెడియన్‌కి సిటీ మధ్యలో సెక్యూరిటీ ఇచ్చారు..’ అంటూ ఇటీవల స్టాండప్ కమెడియన్ షో జరగడంపైనా ఎన్టీయార్ అభిమానులు మండిపడుతున్నారు.

మొత్తమ్మీద, ఈ వివాదంతో ఎన్టీయార్ రాజకీయంగానూ కార్నర్ అయిపోయినట్లున్నాడు. అభిమానుల అత్యుత్సాహం నేపథ్యంలో ఇది రాజకీయ వివాదంగా మారే అవకాశమూ లేకపోలేదు.