Nora Fatehi : డబ్బుల్లేక హుక్కా సెంటర్ లో పని చేశా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్..!
NQ Staff - June 4, 2023 / 09:59 AM IST

Nora Fatehi : సినిమా రంగం అనేది కలల ప్రపంచం. ఈ రంగుల లోకంలో ఎవరు ఎక్కడ ఉంటారనేది చెప్పడం చాలా కష్టం. కాగా ఇప్పుడు మనకు స్టార్లుగా కనిపిస్తున్న చాలామంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన వారు కూడా ఉన్నారు. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఒకప్పుడు దీన పరిస్థితులను అనుభవించిన వారే ఉన్నారు.
ఇలాంటి వారి లిస్టులోకి వస్తుంది నోరా ఫేతేహి. ఈమెది అసలు మన ఇండియానే కాదు. ఆమెది కెనడా. కానీ బాలీవుడ్ లోకి వచ్చి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఐటెం సాంగ్స్ లకు ఆమె పెట్టింది పేరు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె తన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
నేను అందరి అమ్మాయిల్లా కాదు. నేను మొదట్లో ఎలాంటి పార్టీలకు వెళ్లేదాన్ని కాదు. నా రూమ్ లోనే తలుపులు పెట్టుకుని హిందీ భాష నేర్చుకున్నాను. సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా హిందీ వచ్చింది. నేను ఇండియాకు వచ్చిన మొదట్లో నా దగ్గర డబ్బులు పెద్దగా ఉండేవి కావు.
దాంతో హుక్కా సెంటర్ లో కూడా పని చేశాను. ఆ రోజులు నేను ఇంకా మర్చిపోలేదు. నా సోదరుడి పెండ్లికి కూడా వెళ్లలేకపోయాను. ఈ రోజు ఇలా ఉన్నాను అంటే అదంతా నా హార్డ్ వర్క్ వల్ల జరిగిందే అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.