Nookaraju : ప్రేయసి కాళ్లు పట్టుకున్న నూకరాజు.. త్వరలోనే పెళ్లికి సిద్ధం?
NQ Staff - June 24, 2022 / 02:26 PM IST

Nookaraju : జబర్ధస్త్‌లో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుడిగాలి సుధీర్- రష్మీ ప్రేమ పెళ్లి విషయం అయితే ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక పటాస్ షో ద్వారా ఫేమస్ అయి ఇప్పుడు జబర్ధస్త్‌తో పాటు పలు షోస్‌లోనటించి మంచి పేరు తెచ్చుకున్నాడు నూకరాజు.

Nookaraju and Asia love story
నిజమెంత?
ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకుని నటన వైపు అడుగులు వేసిన నూకరాజు తాజాగా తన ప్రేయసి కాళ్ళ మీద పడిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ కోసం ఓ ప్రోమోను వదిలారు. అందులోనే ఈ వ్యవహారం కనిపించింది. ఇది చూసి జనాలందరు పలు విషయాలు మాట్లాడుకుంటున్నారు.
పటాస్ షో చేస్తున్న సమయం నుంచి నూకరాజు ఆసియా మధ్య స్నేహం ఉందని అందరికీ తెలుసు. అయితే ఆసియా కానీ నూకరాజు కానీ తమ ప్రేమ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదు. కానీ ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో మాత్రం వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నూకరాజు ఆసియాల ప్రేమ గురించి చర్చ జరుగుతోంది. తాజాగా ఇద్దరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించారు.
మధ్యలో లవ్ బ్రేక్ అయినందుకు నూకరాజు ఏకంగా ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడంతో షోలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆ సంఘటనతో ఇద్దరు మళ్లీ కలిసి పోయినట్టు చూపించారు. దీంతో తాము ప్రేమలో ఉన్నామన్నట్టు వాళ్లే క్లారిటీ ఇచ్చినట్టు అయింది.
మరో పక్క ఒక జబర్దస్త్ కమెడియన్ తన యూట్యూబ్ ఛానల్ లో నూకరాజు ఆసియాల ప్రేమ గురించి వారిద్దరి ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడని అంటున్నారు. ఆ కమెడియన్ అధికారికంగా ప్రకటించడం వల్ల ఇది ఖచ్చితంగా నిజం అయ్యే ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.