Nivetha thomas : నివేదా ఏంటీ మరీ ఇలా డ్రమ్‌ లా తయారయ్యిందంటూ ట్రోల్స్‌

NQ Staff - September 10, 2022 / 04:13 PM IST

Nivetha thomas : నివేదా ఏంటీ మరీ ఇలా డ్రమ్‌ లా తయారయ్యిందంటూ ట్రోల్స్‌

Nivetha thomas : తెలుగు లో జెంటిల్‌ మెన్ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా థామస్‌. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ పెద్ద హీరోలకు జోడీగా నటించింది.

తెలుగు లో వరుసగా నానితో రెండు సినిమాల్లో నటించి ఎన్టీఆర్ కి జోడీగా జై లవకుశ సినిమాలో నటించింది. టాలీవుడ్‌ లో వకీల్ సాబ్ తో ఈ అమ్మడు మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. స్కిన్ షో కి దూరంగా ఉండే ఈ అమ్మడు క్యూట్‌ ఫోటోలను వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు

మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక వీడియో లో ఈమె మరీ లావుగా కనిపించడంతో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరీ ఇలా డ్రమ్‌ లా మారిందేంట్రా బాబోయ్‌ అంటున్నారు.

Nivetha thomas Latest Cute Video

Nivetha thomas Latest Cute Video

ఈ వీడియోలో నివేదా ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకింత ఆశ్చర్యపోవడం ఖాయం. మొన్నటి వరకు బోద్దుగా ఉన్నా ముద్దుగా అనిపించేదని.. ఇప్పుడు మరీ బొద్దుగా తయారయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సినిమా ల్లో హీరోయిన్ గా నటించే ఆసక్తి ఈమెకు ఉందా లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సినిమాల్లో నటించాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి. సరే మునుపటి మాదిరిగా కాస్త బొద్దుగా ఉన్నా పర్వాలేదు కానీ మరీ ఇలా డ్రమ్‌ లా ఉంటే ఏ హీరో మాత్రం నటించేందుకు ఆసక్తి చూపిస్తాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us